కొబ్బరి పాలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

ప్రపంచవ్యాప్తంగా కొబ్బరిపాలను( Coconut Milk ) ఎన్నో రకాల వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు.

ఇది వంటకాలను రుచికరంగా చేయడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

కొబ్బరి నుంచే కొబ్బరిపాలను తయారు చేస్తారు.ఈ పాలను ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు.

ఇవి వంటలను టేస్టీగా చేస్తాయి.నిజానికి ఈ పాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు( Health Benefits ) కూడా ఉన్నాయి.

కొబ్బరిపాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమైతాయి.ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరిపాలలో విటమిన్ సి, విటమిన్ ఈ, బీ కాంప్లెక్స్, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

"""/" / ఇవన్నీ పోషక లోపాలను దూరం చేస్తాయి.కొబ్బరి పాలు క్రమం తప్పకుండా తీసుకుంటే తక్షణమే శరీరానికి శక్తిని అందిస్తుంది.

కొబ్బరి పాలలోని ఆరోగ్యకరమైన కొవ్వులు( Healthy Fats ) మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.దీని వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

గుండె పోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.కొబ్బరి పాలలో మీడియం చైన్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.

"""/" / ఇవి జీర్ణ క్రియ కు( Digestion ) ఎంతగానో ఉపయోగపడతాయి.

ఇవి రక్త ప్రవాహంలోకి నేరుగా గ్రహించబడతాయి.అలాగే మనకు శక్తి వనరుగా ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే కొబ్బరి పాలలో ఉండే లారీక్ ఆమ్లం, యాంటీ మైక్రోబయల్, యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది.

ఇది మన రోగనిరోధక శక్తి నీ పెంచడమే కాకుండా అంటూ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.

కొబ్బరి పాలలో క్యాల్షియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.ఇవి ఎముకలను, దంతాలను ఆరోగ్యంగా బలంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.

కొబ్బరి పాలను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.అలాగే కొబ్బరి పాలు జుట్టు ఆరోగ్యాన్ని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.

త్రివిక్రమ్ గుంటూరు కారం విషయం లో ఎలాగైతే చేశాడో దేవర విషయం లో కొరటాల అలానే చేశాడా.?