దృశ్యంలో మీనా పాత్రను ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్,( Venkatesh ) సీనియర్ హీరోయిన్ మీనా( Meena ) చాలా సినిమాలలో జంటగా నటించిన విషయం తెలిసిందే.

గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా దృశ్యం.

( Drishyam Movie ) ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

కూతురు భవిష్యత్తు కోసం ఒక కన్న తండ్రి పడే ఆవేదన తపన, పోరాటమే ఈ చిత్రం.

ఈ సినిమా మలయాళం మూవీకి రీమేక్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.మలయాళ నటుడు మోహన్ లాల్( Mohan Lal ) నటించిన సూపర్ హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.

"""/" / అయితే మోహన్ లాల్ మలయాళం లో హీరోగా నటించగా అక్కడ భార్యగా మీనా నటించిన విషయం తెలిసిందే.

తెలుగులో కూడా మీనానే నటించింది.ఇకపోతే మొదట ఈ పాత్రకు మీనాని అనుకోలేదట.

మీనా కంటే ముందుగా ఈ పాత్ర కోసం సీనియర్ నటి శోభనను( Senior Actress Shobhana ) అనుకున్నారట.

అయితే ఆ సినిమాను ఆమె తిరస్కరించిందట.అందుకు గల కారణాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది శోభన.

ఆ సమయంలో తాను వినీత్ శ్రీనివాసన్ సినిమాలో నటిస్తున్నానని అందుకే దృశ్యం సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలిపింది శోభన.

"""/" / ఈ విషయం ఇప్పుడే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇకపోతే వెంకటేష్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తుండగా మరోవైపు మీనా అడపాదడపా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇక వెంకీ మామ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు వెంకటేష్.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఓజీ సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్నారా.. రామ్ చరణ్ జవాబు ఇదే!