దుబాయ్‌లో బంగారం ధర ఎంత తక్కువో తెలిస్తే షాకవుతారు!

ఎవరైనా దుబాయ్ టూర్‌కి వెళ్లినప్పుడు అక్కడి నుంచి బంగారం కొనుక్కుని ఇండియాకి తెచ్చుకోవాలనుకుంటారు.

అలాగే తమకు తెలిసిన వారు ఎవరైనా దుబాయ్ వెళ్లినా అక్కడి నుంచి బంగారం కొనుగోలు చేసి తీసుకురావాలని వారికి చెబుతుంటారు.

అయితే అక్కడ బంగారం ఎంత ధరలో దొరకుతుందో మీకు తెలుసా? దుబాయ్‌లో బంగారం కొనడానికి అందరూ ఎందుకు మక్కువ చూపుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

దుబాయ్‌లో బంగారాన్ని కొనుగోలు చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి, బంగారం కొనుగోలుకు గమ్యస్థానంగా దుబాయ్ పేరొందింది.

దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉండడమే ఇందుకు మొదటి కారణం.ఇక్కడ ఒక గ్రాము బంగారం ధర 216.

00 ఏఈడీ.10 గ్రాముల బంగారం ధర 2160 ఏఈడీ.

భారతదేశపు కరెన్సీ ప్రకారం చూస్తే అక్కడ 10 గ్రాముల బంగారం ధర రూ.

44,107.భారతదేశంలో బంగారం రేటు దీనికన్నా అధికంగా ఉంది.

ప్రస్తుతం దేశంలో బంగారం ధర 10 గ్రాములు రూ.49 వేలు ఉంది.

అంటే దుబాయ్‌కి భారత్‌కు బంగారం ధరలో 6 వేల రూపాయల తేడా కనిపిస్తోంది.

ఈ రేటు 24 క్యారెట్ల బంగారానికి సంబంధించినది.దుబాయ్‌లో బంగారం స్వచ్ఛత అధికంగా ఉండటం మరో కారణంగా నిలిచింది.

అయితే అక్కడి నుంచి బంగారాన్ని ఎలా కొనుగోలు చేయాలనే ప్రశ్న మీ మదిలో ఇప్పటికే మెదిలే ఉంటుంది.

ఒక వ్యక్తి చాలా సంవత్సరాలుగా దుబాయ్‌లోనే ఉంటూ ఇండియాకు వచ్చేటప్పుడు బంగారాన్ని తీసుకువస్తే అతనికి కస్టమ్స్ డ్యూటీలో కొంత మినహాయింపు ఉంటుంది.

దుబాయ్‌కి టూరిస్టుగా వెళ్లి బంగారం కొనుగోలు చేసి, తీసుకురావాలంటే వారికి నిబంధనలు వేరేగా ఉంటాయి.

ఒక సంవత్సరం పాటు దుబాయ్‌లో ఉన్న భారతీయులు తమతో పాటు 40 గ్రాముల బంగారాన్ని ఇక్కడకు తీసుకురావచ్చు.

(ఈ పరిమితి మహిళలకు).పురుషులు 20 గ్రాముల వరకు బంగారాన్ని తీసుకురావచ్చు.

దుబాయ్ టూర్‌కు వెళ్లిన పురుషులు 50 వేల రూపాయలు, మహిళలు లక్ష రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేయవచ్చు.

ఇతర కుటుంబ సభ్యుల ఆధారంగా కూడా బంగారాన్ని కొనుగోలు చేయవచ్చనే నిబంధన కూడా ఇందులో ఉంది.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో…?