కోహ్లి, డివిలియర్స్ ను ఐపీఎల్ లో బ్యాన్ చేయాలంటున్న కేఎల్ రాహుల్… ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం యూఏఈ దేశంలో ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది.అత్యధిక పాయింట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుతం మొదటి స్థానంలో నిలబడింది.

ఇక చివరి స్థానంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు నిలిచింది.ఇకపోతే నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి.

ఈ సందర్భంగా పుమా ఇండియా కంపెనీ నిర్వహించిన ఇంస్టాగ్రామ్ లైవ్ లో ఇరు జట్లకు చెందిన కెప్టెన్ లు పాల్గొన్నారు.

ఈ లైవ్ లో కోహ్లి అడిగిన కొన్ని ప్రశ్నలకు కె.ఎల్.

రాహుల్ సమాధానం ఇస్తూ వచ్చాడు.ఇందులో భాగంగానే కె.

ఎల్.రాహుల్ కు టి20 క్రికెట్ ఐపీఎల్ లో చూడాలనుకుంటున్న ఒక మార్పు గురించి చెప్పవా అని కోహ్లి రాహుల్ ని అడగగా.

అందుకు రాహుల్ చాలా ఫన్నీగా సమాధానమిచ్చాడు.అదేమిటంటే.

వచ్చే ఐపీఎల్ సీజన్ నుండి ఏబి డివిలియర్స్, విరాట్ కోహ్లి లను ఐపీఎల్ నుంచి నిషేధించాలంటూ సరదాగా సమాధానమిచ్చారు.

రానున్న ఐపీఎల్ లో వీరిద్దరిని ఆడకుండా బ్యాన్ చేయాలని నిర్వాహకులను కోరుతున్నట్లు కేఎల్ రాహుల్ తెలిపాడు.

అయితే అందుకు కారణం లేకపోలేదు.అదేమిటంటే ఆటతీరు ఓ స్థాయిని మించిన తర్వాత ప్రేక్షకులు ఇక చాలు అంటారు.

5000 మార్క్ ను చేరుకునే వరకు ఆగితే చాలు ఆ తర్వాత మరో బ్యాట్స్ మెన్ కు అవకాశం కల్పించాలంటూ కేఎల్ రాహుల్ కోహ్లితో ఫన్నీగా సంభాషించాడు.

ఇక అలాగే మరికొన్ని విషయాలపై కూడా వీరిద్దరు లైవ్ సెషన్ లో ముచ్చటించారు.

అందులో భాగంగానే కె.ఎల్.

రాహుల్ మాట్లాడుతూ 100 మీటర్లకు పైగా సిక్స్ వెళితే వాటికి అదనపు పరుగులు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తెలిపాడు.

అయితే ఇందుకు సంబంధించి విరాట్ కోహ్లి మాట్లాడుతూ.ముందుగా ఈ విషయం సంబంధించి తాను బౌలర్లతో మాట్లాడాలని, నేను అవును అంటే.

బౌలర్లు నన్ను చూసినప్పుడు వారి ముఖంలో మార్పు చూడాల్సి వస్తుంది అంటూ కోహ్లి ఫన్నీగా సమాధానమిచ్చాడు.

పిఠాపురంలో మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్ ప్రచారం..!!