అబ్బా ఏమి ఫిల్ ఉంది మామ.. సంజీవ్ గోయెంకా దిమ్మ తిరిగేలా షాకిచ్చిన కేఎల్ రాహుల్..!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్( Delhi Capitals ) అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది.

లీగ్ దశలో మంచి విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తోంది.తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌పై( Lucknow Super Giants ) ఆ జట్టు ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి ప్రత్యర్థిని ఓడించింది.ముఖ్యంగా కేఎల్ రాహుల్( KL Rahul ) హాఫ్ సెంచరీ, ముకేశ్ కుమార్ కట్టుదిట్టమైన బౌలింగ్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

"""/" / ఇక ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 42 బంతుల్లో 57 నాటౌట్ తో జట్టు విజయంలో అద్భుతంగా రాణించాడు.

మరోవైపు, ముకేశ్ కుమార్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కుదేలు చేశాడు.

తమ సొంత మైదానంలోనే లక్నోను ఓడించిన ఢిల్లీ జట్టు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంది.

ఇకపోతే, గత సీజన్‌లో లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ నిరాశజనక ప్రదర్శన ఇచ్చాడు.

దీంతో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా( Sanjiv Goenka ) ఆయనపై బహిరంగంగానే విమర్శలు చేశారు.

తర్వాత రాహుల్‌ను ఆ టీంను వదిలేసి, పంత్‌ను రూ.27 కోట్లకు సైన్ చేసి కెప్టెన్ చేశారు.

కానీ, పంత్ ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతూ జట్టు నెత్తిన భారంగా మారాడు.

"""/" / తాజా మ్యాచ్‌లో కూడా పంత్ డక్ అవుట్ కాగా, రాహుల్ మాత్రం మెరిశాడు.

ఇకపోతే, మ్యాచ్ అనంతరం లక్నో జట్టు ఓనర్ గోయెంకా, అతడి కొడుకు రాహుల్‌ను అభినందించేందుకు ప్రయత్నించారు.

షేక్‌ హ్యాండ్ ఇచ్చిన రాహుల్.వారివైపు తిరకుండానే అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోయాడు.

ఈ ఘటనతో గోయెంకా మొహం చిన్నబోయినట్లుగా కనిపించాడు.ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెటిజన్లు గోయెంకాపై వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.కేఎల్ రాహుల్ గుణపాఠం బాగా చెప్పాడు అంటూ స్పందిస్తున్నారు.