ప్రముఖ క్రికెటర్ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రియురాలి తండ్రి...

భారత క్రికెట్ జట్టులో ఆల్ రౌండర్ మరియు హిట్టర్ హార్దిక్ పాండ్యా మరియు డాషింగ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఎంత మంచి స్నేహితులో  అందరికీ బాగా తెలుసు.

గతంలో ఐపీఎల్ మ్యాచ్ లో వీరిద్దరు తమ  జట్ల జెర్సీలను మార్చుకుని తమ స్నేహాన్ని చాటుకున్నారు కూడాను.

అయితే తాజాగా హార్దిక్ పాండ్యా ప్రముఖ బాలీవుడ్ నటి అయినటువంటి  నటాషాస్టాన్ కోవిచ్  తన ప్రేమను బహిరంగంగా తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం కేఎల్ రాహుల్ కూడా ప్రముఖ బాలీవుడ్ నటుడు  సునీల్ శెట్టి కూతురు అయినటువంటి అతియా శెట్టితో గతకొద్ది కాలంగా ప్రేమలో ఉన్నాడు.

అయితే ఈ వార్తలపై రాహుల్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.అయితే ఇది ఇలా ఉండగా రాహుల్ ప్రియురాలు అథియా శెట్టి  తండ్రి సునీల్ శెట్టి తమ కుటుంబంలోని పిల్లలంటే తమకి  చాలా ఇష్టం అని కాబట్టి వారి ఇష్టాలకి విలువ ఇస్తామని అన్నారు.

అంతేగాక వాళ్లు తమ జీవిత భాగస్వాములు గా ఎవరిని ఎంచుకుంటే సంతోషంగా ఉంటారో వారిని ఎంపిక చేసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నాడు.

 దీంతో పరోక్షంగా అథియా శెట్టి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. """/"/అంతేగాక ఇప్పటికే తన కుమారుడు అహాన్ కూడా ప్రేమలో ఉన్నాడని అతడి ప్రియురాలు అంటే తను కూడా ఇష్టమేనని అదేవిధంగా అథియా కూడా ఎవరినైతే ఇష్టపడుతుందో వారిని కూడా  నేను గౌరవిస్తాను కూడా తెలిపాడు.

దీంతో  ఇక అథియా శెట్టి తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడమే మిగిలి ఉంది.

మిగిలిపోయిన రైస్ తో ఇలా చేశారంటే మెడ నలుపు దెబ్బ‌కు మాయం అవుతుంది!