రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, వెంకటాపూర్ గ్రామాలలో 4 రోజుల క్రితం మృతి చెందిన బాల్ రెడ్డి, పరశురాములు కుటుంబాలను గురువారం సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు.
పదిర గ్రామానికి చెందిన గుల్ల పెళ్లి బాల్ రెడ్డి 4 రోజుల క్రితం మృతిచెందగా వారి కుమారులు లక్ష్మారెడ్డి , మల్లారెడ్డి, నారాయణరెడ్డి, జలపతిరెడ్డిలను పరామర్శించారు.
అదేవిధంగా వెంకటాపూర్ గ్రామంలో గుండెపోటుతో మరణించిన పులి పరశురాములు భార్య కవిత,కుమార్తెలు కావ్య, వర్షిని లను పరామర్శించారు.
ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, నాయకులు దొమ్మాటి నరసయ్య, రాజేందర్, రాజు నాయక్, గండికోట రవి ,చెరుకు ఎల్లయ్య, పరశురాములు, తిరుపతిరెడ్డి, కిషన్, అంజిరెడ్డి ఉన్నారు.
ముఖంపై నల్లటి మచ్చలా.. క్యారెట్ తో ఈజీగా వదిలించుకోండిలా!