కింగ్ కోహ్లీని ఘోరంగా అవమానించిన కివీస్ వెబ్‌సైట్..!

భారత సారథి విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అతని క్రేజ్‌ ని చూసి ఈర్ష్య పడేవారి సంఖ్య కూడా రోజురోజుకీ ఎక్కువైపోతోంది.

తాజాగా ముగిసిన వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ లో టీమిండియా ఓటమితో మరోసారి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు కింగ్ కోహ్లీ.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ లో విరాట్ కోహ్లీ ఆడిన 2 ఇన్నింగ్స్‌ ల్లోనూ అవుట్ చేశాడు న్యూజిలాండ్ స్టార్ బౌలర్ కేల్ జెమ్మీసన్.

మొదటి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసిన విరాట్ ఆట మూడో రోజు ఉదయం సెషన్‌ లో జెమ్మీసన్ బౌలింగ్‌ లో అవుట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్ లో రిజర్వు డేన ఉదయం సెషన్‌ లోనూ అతని బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు కోహ్లీ.

"""/"/ ఇప్పటివరకు జెమ్మీసన్ బౌలింగ్‌ లో విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడం ఇది మూడో సారి.

ఇంకా చెప్పాలంటే 2019లో టెస్టుల్లో మొదటి మ్యాచ్ ఆడిన కేల్ జెమ్మీసన్ తన కెరీర్‌ లో తీసిన మొట్టమొదటి వికెట్ కూడా విరాట్ కోహ్లీదే కావడం విశేషం.

దీంతో కింగ్ విరాట్ కోహ్లీ, జెమ్మీసన్ చేతుల్లో ఆడించే ఓ పెంపుడు కుక్కగా మారాడనే అర్థం వచ్చే విధంగా.

ఓ రాణి, తన భర్తను కుక్కలా ఆడిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది న్యూజిలాండ్‌ కి చెందిన ప్రముఖ వెబ్‌సైట్ TheAccNZ.

"""/"/ న్యూజిలాండ్ 21 ఏళ్ల తర్వాత దక్కిన ఒకే ఒక్క విజయాన్ని చూసి ఇలా ప్రవర్తించడం వల్ల వారి మదం ఏ రేంజ్‌ లో ఉందో చెప్పడానికి ఉదాహరణ అని అంటున్నారు నెటిజన్లు.

దీంతో న్యూజిలాండ్ చివరిసారిగా 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే, మరో టైటిల్ సాధించడానికి వారికి 21 ఏళ్లు పట్టిందని ఈ సమయంలో భారత జట్టు మూడు ఐసీసీ టైటిల్స్ ను గెలిచిందనే విషయాన్ని కివీస్ ప్రజలు గుర్తుంచుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ పెద్ద ఎతున్న కామెంట్లు చేస్తున్నారు.

వీడియో వైరల్: క్షణాలలో 8 సార్లు పల్టీ కొట్టిన కారు.. చివరకి?