ఆహారంలో ఉన్న విషాన్ని చిటికెలో కనిపెట్టే కిట్స్..!

ప్రముఖులు, రాజకీయనాయకులు, వీవీఐపీలు బయటకు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వారు తినే భోజనమును కానీ అల్పాహారంను గాని ముందు ఎవరైనా టెస్ట్ చేసి ఆ తరువాత వారు తింటారు.

ఒకవేళ వారు తినే ఆహార పదార్ధాలలో ఏమైనా కలుషితమైనగాని, లేక ఎవరైనా విష పదర్ధాలు కలిపినాగాని వీవీఐపీ ప్రాణాలకు ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు తాము తినబోయే ఆహారాన్ని ముందస్తుగా టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఫుడ్ టెస్టింగ్ ఉద్యోగులను నియమించుకుంటారు.

ఈ పద్ధతి రాజుల కాలం నుంచి అమలులో ఉంది.అయితే ఈ పద్దతిని ఉపయోగించడం వలన ఒక మనిషి ప్రాణాలు పోయే అవకాశం ఉంది.

ఒకవేళ ఆ ఆహారంలో ఎవరైనా విషం కలిపితే మాత్రం ఫుడ్ టెస్టర్ ప్రాణాలు కోల్పోవడం ఖాయం.

అయితే ఈ పద్ధతి సరైనది కాదు అని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (NFSU) భావిస్తోంది.

ఈ క్రమంలోనే మానవ రహిత కిట్‌ ను తయారు చేసే పనిలో పడింది.

ఈ ఫుడ్ టెస్టింగ్ కిట్ ను ఉపయోగించి కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్ లో ఎమన్నా కలుషితాలు, విషాలు ఉన్నా గుర్తించవచ్చని ఎన్ఎఫ్ఎస్‌యూ చెబుతోంది.

ఫుడ్ టెస్టింగ్ కోసం మనుషుల ప్రాణాలను పళంగా పెట్టడం సరైన పద్ధతి కాదని ఎన్ఎఫ్ఎస్‌యూ అభిప్రాయపడింది.

అందుకే ఈ కిట్‌ ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది.అయితే ఈ ఫుడ్ టెస్టింగ్ కిట్ జనవరి 2022 న అందుబాటులోకి రానుందని ఆ సంస్థ వెల్లడించింది.

ప్రముఖ ఏజెన్సీలు, ఇతర ప్రభుత్వ శాఖలు ఇలా ఆహారాన్ని టెస్ట్ చేయడానికీ మనిషి కాకుండా కెమికల్ రియాక్షన్ ఆధారిత ర్యాపిడ్ కిట్‌ లను తయారు చేయాలని యూనివర్సిటీని కోరినట్లు ఎన్ఎఫ్ఎస్‌యూ వైస్ ఛాన్సలర్ డా.

జే.ఎం వ్యాస్ చెప్పారు.

"""/"/ అయితే ఈ ఫుడ్ టెస్టింగ్ కిట్స్ తయారీకి సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.

జయరాజ్‌ సింగ్ సర్వయ్య నాయకత్వం వహిస్తున్నారు.అసలు ఈ కిట్స్ ఎలా పనిచేస్తాయో ఒకసారి తెలుసుకుందాం.

ఒక రసాయన పదార్ధం మరొక రసాయన పదార్థానికి ప్రతిస్పందిస్తుందనే లాజిక్ వలన ఈ కిట్ ను అభివృద్ధి చేయవచ్చట.

ఉదాహరణకు, ఏదైనా ఫుడ్ లో కనుక విషం ఉంటే ఆ ఫుడ్ కలర్ వైలెట్‌ గా మారుతుందని, అలాగే అదే ఫుడ్ లో ఆల్కలాయిడ్ కలుషితాలు ఉంటే అది డార్క్ బ్లూ కలర్ లో మారుతుందని ఆయన వివరణ ఇచ్చారు.

"""/"/ అతి తక్కువ సమయంలోనే మంచిది ఫలితాలు ఇచ్చే విధంగా ఈ కిట్‌ లు రూపొందిస్తున్నామన్నారు.

అంతేకాకుండా ఈ ఫుడ్ టెస్టింగ్ కిట్‌లు దాదాపు 40 రకాల విష పదర్ధాలను, కలుషితాలను పరీక్షించగలవట.

కేవలం10 నిమిషాల్లోనే టెస్ట్ రిజల్ట్స్ కూడా వస్తాయని డా.సర్వయ్య చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా మనువులు ఫుడ్ టెస్ట్ చేస్తే దాని రిజల్ట్స్ కోసం 30 నిమిషాల పాటు అయిన వేచి చూడాలని అలా కాకుండా ఈ కిట్ ఉపయోగిస్తే కేవలం 10 నిమిషాలలోనే రిసల్ట్ తెలుస్తుందట.

ఈ కిట్ ఉపయోగించడం వలన సమయం కూడా ఆదా అవుతుంది మరి.

ఆమెతో వివాహేతర సంబంధం నిజమే.. ఒప్పుకున్న కమలా హారిస్ భర్త