పార్లమెంటును ఊపేస్తున్న కిస్సింగ్ పాలిటిక్స్ !

అనర్హత వేటు ను తప్పించుకొని ఎట్టకేలకు పార్లమెంట్లో అడుగుపెట్టిన కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీని మరో వివాదం చుట్టుముట్టింది.

అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ అసభ్యంగా ప్రవర్తించారని చర్చ ముగించుకొని వెళుతూ భాజపా మహిళ ఎంపీలువైపు చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని ,ఆయన ప్రవర్తన ఒక రోడ్డు మీద పోకిరి లా ఉంది తప్ప బాధ్యతగల ఎంపీగా లేదంటూ 23 మంది మహిళా ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా( Om Birla ) కు కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

స్త్రీల గౌరవానికి సంబంధించిన చట్టాలు చేయవలసిన పార్లమెంట్లో ఈ స్థాయి ప్రవర్తన అభిలషణీయం కాదని ఇది రాహుల్ గాంధీ వ్యక్తిగత ధోరణిని ప్రతిబింబించేలా ఉందంటూ స్మృతి ఇరానీ( Smriti Irani ) ఫైర్ అయ్యారు.

"""/" / ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.వివరాల్లోకి వెళితే అవిశ్వాస తీర్మానంగా చర్చసందర్భంగా మణుపూర్ రెండుగా చేలిపోయిందని ప్రభుత్వ రాజకీయాలు మణిపూర్ లోని భారతమాతను హత్య చేశాయని ,మీరు దేశ రక్షకులు కాదు దేశ హంతకులని, దేశ వాణి ని వినాలి అంటే విద్వేషాన్ని అహంకారాన్ని పక్కన పెట్టాలి అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు.

దానిపై భాజపా ఎంపీలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ గందరగోళం నడుము ఈ ఫ్లైయింగ్ కిస్ వివాదం తీవ్ర స్థాయికి చేరినట్లుగా తెలుస్తుంది.

అయితే తమ నాయకుడు రాహుల్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేక వక్రీకరించడానికి ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు తిరుగుదాడి చేస్తున్నారు.

దేశాన్నిఊపేస్తున్న కీలక విషయాలపై మాట్లాడటానికి భాజపా ఎంపీలకు సమయం ఉండదు కానీ ఇలాంటి చిల్లర విషయాలపై మాత్రం తీవ్ర సాయి చర్చలు చేస్తారంటూ కాంగ్రెస్ నాయకులు వాఖ్యనిస్తున్నారు .

"""/" / అయితే అయితే తాను చేసిన వ్యాఖ్యలకు రెండు సంవత్సరాల గరిష్ట శిక్ష విధించబడి అనర్హత వేటుకు గురైన రాహుల్ గాంధీ ఎట్టకేలకు ప్రధాన న్యాయస్థానం చొరవతో అనర్హతను తప్పించుకొని తిరిగి పార్లమెంటులో అడుగు పెట్టగలిగారు అయితే ఇంతలోనే ఆయన మరో వివాదం లో చిక్కుకోవడం గమనార్హం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై1, సోమవారం 2024