ఆ ప‌ని త‌న‌దే అంటున్న కిష‌న్‌రెడ్డి.. క్రెడిట్ కొట్టేయ‌డం కోస‌మేనా?

ప‌నిచేయ‌డం కాదు.ఆ ప‌నిని త‌మ ఖాతాలో వేసుకోవ‌డమే ఇప్ప‌టి రాజ‌కీయం.

ఇప్ప‌టికే అనేక విష‌యాల్లో మ‌న రాజ‌కీయ నాయ‌కులు ఇదే పంతాలో సాగుతున్నారు.ఇప్పుడు తాజాగా ఓ కేంద్ర‌మంత్రి కూడా ఎక్క‌డ ఆ ప‌ని త‌న ఖాతాలో చేర‌కుండా పోతుందో అని దానికోసం తెగ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఆయ‌నెవ‌రో కాదు కేంద్ర స‌హాయ‌మంత్రి కిష‌న్‌రెడ్డి.ఇంత‌కీ ఆయ‌న ఏ ప‌ని కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నాడో అనుకుంటున్నారా.

అదేంటో ఇప్పుడుచూద్దాం ప‌దండి ముందుకు.తెలంగాణ హైకోర్టులో న్యాయ‌మూర్తుల సంఖ్య‌ను పెంచాల‌నే డిమాండ్ ఎప్ప‌టి నుంచో పెండింగ్‌లోనే ఉంది.

అయితే చాలా రోజుల త‌ర్వాత రీసెంట్‌గా ఈ ప‌నిపై సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌త్యేక చొర‌వ చూపించి మ‌రీ దాన్ని కార్య‌దూరం దాల్చేలా చూశారు.

కాగా ఆయ‌న చొర‌వ‌తో ఇప్పుడు హైకోర్టులో జ‌డ్జీల సంఖ్య‌ను కూడా పెంచేసింది కేంద్రం.

ఇక్క‌డ అస‌లు ట్విస్టు ఏంటంటే.ఈ ప‌ని త‌న‌దే అంటూ చెబుతున్నారు కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి.

ప్ర‌స్తుతం కిష‌న్‌రెడ్డి చేస్తున్న ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారుతున్నాయి.ఆయ‌న ఇప్పుడు తెలంగాణ నుంచి కేంద్రానికి ప్ర‌తినిధిగా ఉన్నారు.

"""/"/ అలాంటి వ్య‌క్తి ప్ర‌మేయం లేకుండానే ఈ ప‌ని జ‌రిగిందంటే బాగుండ‌ద‌ని ఆయ‌న ఈ పంతా ఎంచుకున్నారు.

త‌న కండ్ల ముందే జ‌డ్జీల సంఖ్య పెంపుకు సంబంధించిన ఫైల్ పై కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆమోద ముద్ర వేశార‌ని చెప్పారు.

త‌న నిర్ణ‌యం చెప్పిన త‌ర్వాత ఆయ‌న స‌మ్మ‌తించార‌ని, జ‌డ్జీల సంఖ్య‌ను 24 నుంచి 42కు పెంచారంటూ చెప్పుకొచ్చారు కిష‌న్‌రెడ్డి.

అయితే ఈ ప‌ని క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకునేందుకు ఇంత‌గా త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఏదేమైనా కిష‌న్‌రెడ్డి స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.ప్ర‌తి విష‌యంలో త‌న హ‌స్తం ఉంద‌ని చెప్పేందుకు బాగానే ప్లాన్లు వేస్తున్నారు ఆయ‌న‌.

చైనా దురాగతం.. మాలిలో బంగారు గని కూలి 43 మంది మహిళా కూలీలు దుర్మరణం!