బడ్జెట్ 7 కోట్లు.. కలెక్షన్లు 75 కోట్లు.. ఈ హిట్ మూవీ ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రస్తుతం ఓటీటీల ( OTT )ఎంట్రీ వల్ల ఇతర భాషల సినిమాలను సైతం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చూస్తున్నారు.

సినిమాలకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా ఓటీటీలలో సబ్ టైటిల్స్ తో చూడటానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

మలయాళ మూవీ కిష్కింద కాండం కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్ ( 7 Crore Budget )తో తెరకెక్కి ఏకంగా 75 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

బడ్జెట్ తో పోల్చి చూస్తే ఏకంగా 10 రెట్ల కలెక్షన్లను సాధించింది.దింజిత్ అయ్యతన్ ( Dinjit Ayathan )ఈ సినిమాకు దర్శకుడు కాగా ఆయన తన టేకింగ్ తో మ్యాజిక్ చేశారని చెప్పవచ్చు.

మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్లను సాధించిన ఈ ఏడాది టాప్ 10 సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.

ఒక్క పాట, ఒక్క ఫైట్ లెకుండా సినిమా తీయడానికి సాధారణంగా దర్శకనిర్మాతలు ఆసక్తి చూపించరు.

అయితే కిష్కింద కాండం( Kishkinda Kandam ) మూవీలో ఇవి లేకపోయినా కొత్తదనంతో ఉన్న కథ, కథనం ఈ సినిమా సక్సెస్ కు కారణమయ్యాయి.

"""/" / సినిమాలో చివరి 20 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు.

ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయ రాఘవన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించగా వాళ్లు తమ పాత్రలకు ప్రాణం పోశారు.

ఈ సినిమా నిడివి 2 గంటల 16 నిమిషాలు కాగా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మలయాళంలో తెరకెక్కిన కొన్ని సినిమాలు తెలుగులో డబ్, రీమేక్ అయ్యి ఇక్కడ సైతం సక్సెస్ సాధించాయి.

"""/" / కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగేది.

తెలుగు భాషలో సైతం ఈ సినిమా అందుబాటులోకి రావడం గమనార్హం.థియేటర్లలో విడుదలైన 11 వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ప్రముఖ భారతీయ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

బాలీవుడ్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్న టాలీవుడ్…