బీఆర్ఎస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి విమర్శనాస్త్రాలు
TeluguStop.com
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.తెలంగాణలో సింరగేణి సంస్థ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని తెలిపారు.
ఎన్నికల సమయంలోనే సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుర్తొస్తారని కిషన్ రెడ్డి విమర్శించారు.
సింగరేణి కార్మికులకు సొంత ఇల్లు కట్టి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.సింగరేణిలో పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతోందని తెలిపారు.
20 వేల పర్మినెంట్ ఉద్యోగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం కోత పెట్టిందన్నారు.సింగరేణి బకాయిలు కూడా రూ.
10 వేల కోట్లు దాటాయని పేర్కొన్నారు.అప్పులు చేస్తే కానీ సింగరేణి కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
సింగరేణి పరిస్థితి ఇలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
వైరల్.. ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో పెళ్లి చేసుకున్న వివాహిత మహిళలు