బీజేపీ రాష్ట్ర కమిటీలో చేర్పులపై కిషన్ రెడ్డి కసరత్తు
TeluguStop.com
తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.బీజేపీ రాష్ట్ర కమిటీలో చేర్పులపై ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే పాత వారిని కొనసాగిస్తూనే కొత్తవారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇద్దరు ఉపాధ్యక్షులు, ఇద్దరు సెక్రటరీలు, నలుగురు అధికార ప్రతినిధులకు అవకాశం ఉందని సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల కోసం 22 కమిటీలను ఏర్పాటు చేయాలని బీజేపీ నిర్ణయించింది.ఈ మేరకు ఎన్నికల నిర్వహణ కమిటీలో సభ్యులతో పాటు అనుబంధ కమిటీలపై కసరత్తు చేస్తున్నారు.
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి… అందరూ షాక్!