కేసీఆర్ కు కిషన్ రెడ్డి తొత్తుగా మాట్లాడుతున్నారు..: మంత్రి పొన్నం
TeluguStop.com
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు.కేసీఆర్ కు కిషన్ రెడ్డి తొత్తుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసని తెలిపారు.కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం అని బీజేపీ అన్నది నిజం కాదా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
కేసీఆర్ స్క్రిప్ట్ ను బీజేపీ నేతలు చదివారన్న పొన్నం ప్రభాకర్ కాళేశ్వరంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఇప్పటికే ఆదేశించామని తెలిపారు.
కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
క్రిమినల్స్‌ని ఇలా కూడా తీసుకెళ్తారా.. ఈ పోలీస్ వీడియో చూస్తే నవ్వే నవ్వు…