వివాదాస్పదమైన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు...మందలించిన షా

ఇటీవల నరేంద్ర మోడీ క్యాబినెట్ లో కిషన్ రెడ్డి కి సహాయక మంత్రిగా చోటు దక్కిన సంగతి తెలిసిందే.

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి కి అవకాశం ఇచ్చారు.అయితే సహాయ మంత్రి అయ్యారో లేదో అప్పుడే కిషన్ రెడ్డి వార్తలలో నిలిచారు.

హైదరాబాద్ ఉగ్రవాదులకు సేఫ్ జోన్ గా నిలిచింది అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.

దీనితో రంగంలోకి దిగిన నూతన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కిషన్ రెడ్డిని మందలించినట్లు సమాచారం.

కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉంది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని,ఇక ఫై ఇలాంటి కామెంట్లు మానుకోవాలి అంటూ షా మందలించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.

ఉగ్రవాద కార్యకలపాలకు హైదరాబాద్‌ సేఫ్‌ జోన్‌గా మారిందంటూ వ్యాఖ్యానించారు.అంతేకాకుండా బెంగళూరు, భోపాల్ సహా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 2-3 నెలలకు ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారని కిషన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

"""/"/ మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలపై హైదరాబాద్‌ ఎంపీ అసద్‌దుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు.

ఆయన ఇంకా మంత్రి పదవి చేపట్టకుండానే హైదరాబాద్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారు,ఆయనకు హైదరాబాద్ తో ఉన్న శత్రుత్వం ఏంటి అని ఆయన ప్రశ్నించారు.

అయినా ఐసిస్‌ సభ్యులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడ్డారు.మరి అది ఉగ్రవాదుల అడ్డా అని చెప్పగలరా.

? బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడకూడదు హితవు పలికారు.కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పద మైన నేపథ్యంలో ఇక షా కల్పించుకొని ఇలాంటి కామెంట్లు చేయకూడదు అంటూ మందలించినట్లు తెలుస్తుంది.

ఇదేంటి జగనన్నా… మ్యానిఫెస్టో షాక్ ఇచ్చిందిగా..?