బోటు బయటకు తీయడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రి

కొన్ని రోజుల క్రితం గోదావరిలో బోటు ప్రమాదంలో పదుల సంఖ్యలో అందులో ప్రయాణిస్తున్న వారు చనిపోయిన విషయం తెల్సిందే.

కొద్ది మంది ప్రాణాలు దక్కించుకోగా ఎక్కువ శాతం మంది మృతి చెందినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు.

మృత దేహాలను దాదాపుగా వెలికి తీయడం జరిగింది.అయితే ఇప్పటి వరకు బోటును గోదావరి నుండి బయటకు తీయడంలోమాత్రం అధికార వర్గాల వారు విఫలం అవుతున్నారు.

దాదాపు వారం రోజులు కఠినంగా పరిశీలించి, టెక్నాలజీని ఉపయోగించిన తర్వాత అప్పుడు బోటు జాడ ఎక్కడ ఉందో తెలిసింది.

బోటు జాడ తెలియడంతో తీయడం పెద్ద కష్టం కాదని అంతా అనుకున్నారు.కాని తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఈ విషయమై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో బోటను బయటకు తీయడం చాలా కష్టం.

ఈ విషయం నాకు ఎన్టీఆర్‌ఐ బృదం అధికారులతో చర్చలు జరిపిన తర్వాత తెలిసింది.

బోటు వెలికి తీసేందుకు సాంకేతిక సహకారం అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉంది.కాని ప్రస్తుతం అందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు అంటూ మంత్రి అన్నారు.

రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించిన కిషన్‌ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడటం జరిగింది.

ప్రైవేట్ పార్ట్‌పై పాము కాటు.. ఇన్‌ఫ్లుయెన్సర్ నరకయాతన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!