దిషా కేసుపై పార్లమెంటులో కీలక ప్రకటన చేసిన కేంద్రం

తెలుగమ్మాయిపై జరిగిన అత్యాయత్నం మరియు హత్య ఉదంతంపై నేడు పార్లమెంటులో చర్చ జరిగింది.

అన్ని పార్టీల నాయకులు ఈ విషయమై కేంద్రంపై మరియు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

రాజ్యసభ మరియు లోక్‌ సభ రెండు సభల్లో కూడా ఈ విషయమై చర్చ జరిగింది.

పెద్ద ఎత్తున సభ్యులు అత్యాచార నిందుతులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్‌ చేసింది.

ఈ నేపథ్యంలో కేంద్రం నుండి కీలక ప్రకటన వచ్చింది.కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.

ఈ శీతాకాల సమావేశాలు పూర్తి అయ్యేప్పటికి ఖచ్చితంగా ఇలాంటి కేసుల విషయంలో కఠిన చట్టాలు తీసుకు వస్తామంటూ హామీ ఇచ్చాడు.

దిషా తరహా సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండేలా చూస్తామంటూ కేంద్రం తరపున హామీ ఇచ్చాడు.

నిందితులకు వెంటనే శిక్ష విధిస్తామంటూ కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చాడు.కిషన్‌ రెడ్డి ప్రకటనతో పార్లమెంటు ఉభయ సభలు కూడా హర్షం వ్యక్తం చేశాయి.

ఆ విషయం లో రవితేజ ఎందుకు వెనకబడ్డాడు… అసలు కారణం ఏంటి..?