కిషన్ దాస్ పేట లో విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Rajanna Sircil) మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేట లో ప్రభుత్వ ప్రాథమిక ఇంచార్జీ వైద్యాధికారి చిరంజీవి ఆధ్వర్యంలో క్యాంప్ నిర్వహణ ఏర్పాటు చేశారు .

కొద్ది రోజులుగా వ్యాధులతో బాధపడుతున్న వారి రక్త నమూనాలు సేకరించి కొన్ని ఎల్లారెడ్డిపేటలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు కొంచెం ఇబ్బందిగా ఉండి ఎక్స్ రే ఆవసరం ఉన్న వారికి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చికిత్స కోసం పంపించినట్లు క్యాంప్ ఇంచార్జీ వైద్యాధికారి డాక్టర్ చిరంజీవి తెలిపారు.

ఈ ఉచిత మెగా వైద్య శిబిరం లో మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ తో పాటు హెల్త్ సూపర్ వైజర్ పద్మ , ఏఎన్ ఎంలు శారద, పుష్పలత, ఆశ వర్కర్లు మరాఠీ సరిత, దొనుకుల లక్ష్మి, వసంత తదితరులు పాల్గొన్నారు.

దేవర థర్డ్ సింగిల్ పై ట్రోల్స్.. ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ సాంగ్ ను కాపీ కొట్టారంటూ?