బేబీ సినిమా నటిని అలా చేస్తామని వేధిస్తున్నారట.. సినిమాలో అలాంటి పాత్ర చేయడంతో?
TeluguStop.com
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బేబీ సినిమా( Baby Movie )లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి కిర్రాక్ సీత మెప్పించారు.
సీతకు దక్కిన స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా కథను మలుపు తిప్పిన రోల్ కావడంతో ఆమెకు ప్లస్ అయింది.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కిర్రాక్ సీత బేబీ సినిమా తర్వాత తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
"""/" /
కిర్రాక్ సీత( Kirrak Seetha ) మాట్లాడుతూ వైష్ణవి అనే పాత్ర వెరీ అడాప్టబుల్ అని చెప్పుకొచ్చారు.
నాకు పర్సనల్ గా బేబీ సినిమాలోని ఆనంద్ రోల్ నెగిటివ్ గా కనిపిస్తాడని ఆమె కామెంట్లు చేశారు.
బేబీ సినిమా విడుదలైన తర్వాత రే*ప్ చేస్తామని, డెత్ థ్రెట్స్ వచ్చాయని ఆమె చెప్పుకొచ్చారు.
నీ అడ్రస్ చెప్పు ఫస్ట్ అంటూ కాల్స్, మెసేజ్ లు వచ్చాయని కిర్రాక్ సీత తెలిపారు.
గుర్తుపెట్టుకో మంచి యాక్టర్ అవుతావని అల్లు అర్జున్( Allu Arjun ) నాతో అన్నారని సీత కామెంట్లు చేశారు.
"""/" /
బన్నీ రెండుసార్లు నాతో ఈ విషయం చెప్పాడని ఆమె పేర్కొన్నారు.
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఒకటి రెండుసార్లు ఫోన్ కాల్స్ లో నేను ఫేస్ చేశానని ఆమె కామెంట్లు చేశారు.
కారులో ప్రయాణిస్తున్న సమయంలో కొంతమంది బైక్ పై ఫాలో అయ్యారని ఆ సమయంలో నాకు చాలా భయం వేసిందని కిర్రాక్ సీత పేర్కొన్నారు.
యూట్యూబ్ వీడియోల ద్వారా సీత ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు.బేబీ సినిమాలోని నా రోల్ ను తెగ తిడుతున్నారని సీత కామెంట్లు చేశారు.
బేబీ సినిమా స్క్రిప్ట్ విన్న సమయంలో సినిమా హిట్ అవుతుందని భావించానని ఆమె కామెంట్లు చేశారు.
మొదట ఆ పాత్రకు నేను సరిపోనని అనుకున్నారని కానీ డైరెక్ట్ గా చూసిన తర్వాత నన్ను ఈ సినిమా కోసం ఎంపిక చేయడం జరిగిందని కిర్రాక్ సీత అన్నారు.
నా అసలు పేరు సుప్రజ అని కిర్రాక్ సీత పేర్కొన్నారు.బేబీ మూవీ నా థర్డ్ మూవీ అని ఆమె వెల్లడించారు.
నేను ఆ భారం అనుభవించాను… నా కూతురికి వద్దు… రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!