మనోధైర్యనికి ప్రతీక,మానసిక సమస్యల పరిష్కార వేదిక “కిరణం”
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆత్మస్థైర్యం కోల్పోయిన జీవితాల్లో నూతన ఆశలు చిగురించేలా కిరణం మానసిక సలహా కేంద్రం రానన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తుందని కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) అన్నారు.
కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సైకాలజిస్ట్ లు, సైకియాట్రిస్ట్ లు, కౌన్సెలర్ లు, వైద్యాధికారులతో జరిగిన సమావేశంలో టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3333 ను లాంఛనంగా ప్రారంభించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ
మానసిక అనారోగ్యాన్ని తొలి దశలోనే గుర్తించడం, ప్రాథమిక చికిత్స, మానసిక మద్దతు, ఒత్తిడి నిర్వహణ, మానసిక ఆరోగ్యం, సానుకూల ధోరణిని పెంచడం వంటి లక్ష్యాలతో మానసిక ఆరోగ్య సేవలను కిరణం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్( Kiranam Toll Free Helpline Number ) అందిస్తుందని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
ఆత్మహత్య ఆలోచనలు, డిప్రెషన్, ఒత్తిడి, ఆతృత, నిరాశ, భయాందోళనలు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్లు, మత్తు పదార్థాలు, సంక్షోభ ప్రేరేపిత మానసిక సమస్యలు, గృహ హింస, మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితులతో మానసిక సమస్యలతో బాధ పడేవారి సమస్యల పరిష్కారానికి
ఈ హెల్ప్‌లైన్ సేవలు ఉపయోగకరం గా ఉంటాయన్నారు.
ఈ టోల్ ప్రీ నంబర్ 24*7 గంటలు పనిచేస్తుందని అన్నారు.ఈ నంబర్ కు ఫోన్ చేసిన వెంటనే నిపుణులైన సైకాలజిస్టు లు, సైక్రియటిస్టు లు, కౌన్సెలర్ లు ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తారని.
మానసిక సమస్యలను ఎలా అధిగమించాలో దిశా నిర్దేశనం చేస్తారని చెప్పారు.అవసరమైన సందర్భంలో జిల్లా వైద్యశాలలో కౌన్సెలింగ్, చికిత్స కొరకు వారిని పంపడం ద్వారా చికిత్స కొనసాగిస్తారని తెలిపారు.
రోగి కొలుకునేంత వరకు ఫాలో అప్ చికిత్స కొనసాగుతుందని తెలిపారు.మానసిక సమస్యలతో బాధపడే ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథంకు సూచించారు.
వైద్యాధికారులు తమ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు ఉప ఆరోగ్య కేంద్రాలలో ప్రచార గోడ పత్రికలను ప్రదర్శించాలన్నారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వీటిని ప్రదర్శించి ప్రజలందరికీ కిరణం టోల్ ఫ్రీ నెంబర్ తెలిసేలా చూడాలన్నారు.
జిల్లాలోని ప్రజలందరు ఇట్టి సౌకర్యాన్ని సద్వినియాగం చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్ రావు, సైకాలజిస్ట్ కె.
పున్న0చందర్, ఈడీఎం శ్రీనివాస్, సైకియాట్రిస్ట్ లు డాక్టర్ సతీష్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ నయీమ, వైద్యాధికారులు పాల్గొన్నారు.
మతిమరుపే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.. అదెలాగో తెలిస్తే..