కిరణ్ అబ్బవరం భార్య అసలు పేరు మీకు తెలుసా.. ఆ షార్ట్ ఫిల్మ్ లో సైతం ఆమె నటించారా?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఇటీవల క సినిమాతో( Ka Movie ) భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.

క సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తోంది.

ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలను చూసిన ప్రేక్షకులను థ్రిల్ ఫీలవుతున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ సినిమాలలో క సినిమా కూడా ఒకటి అని చెప్పవచ్చు.

"""/" / కిరణ్ అబ్బవరం భార్య పేరు రహస్య గోరఖ్( Rahasya Gorak ) అనే సంగతి తెలిసిందే.

రాజా వారు రాణి గారు సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించారు.అయితే ఈ సినిమా రిలీజ్ కు మూడేళ్ల ముందే ఆమె హ్యాపీ ఎండింగ్( Happy Ending ) అనే షార్ట్ ఫిల్మ్ లో నటించారు.

ఈమె అసలు పేరు ఐశ్వర్య గోరఖ్( Aishwarya Gorak ) కాగా 19 సంవత్సరాల వయస్సులో ఆమె ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించారు.

పక్కింటి అమ్మాయిలా కనిపించే రహస్య తన నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. """/" / రహస్య గోరఖ్ ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించి ఉంటే ఆమె కచ్చితంగా స్టార్ స్టేటస్ ను అందుకునేవారు.

రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి రహస్య ఇష్టపడతారని సమాచారం అందుతోంది.

చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ లో ఆసక్తి ఉందని, కూచిపూడి అంటే ఇష్టమని ఆమె ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

2012 సంవత్సరం నుంచి సినీ రంగంలో సక్సెస్ కావడానికి రహస్య గోరక్ ఎంతో కష్టపడ్డారు.

ఎవరైనా నన్ను నా పేరు పెట్టి పిలిస్తే కోపం వస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.

రహస్య గోరఖ్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా లేరు.క మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రహస్య ఇచ్చిన స్పీచ్ నెట్టింట తెగ వైరల్ అయింది.

రహస్య రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆ బ్యూటీ అవసరమా.. ఇలా చేశావేంటి జక్కన్న?