50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించిన క.. కిరణ్ అబ్బవరం అదరగొట్టాడుగా!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ( Young Hero Kiran Abbavaram )ఇటీవలే క సినిమాతో ప్రేక్షకులను పలకరించే విషయం తెలిసిందే.

గత నెల అనగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

ప్రస్తుతం మంచి హిట్ టాక్ తో దూసుకుపోవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చి ఘన విజయాన్ని అందుకుందీ చిత్రం.

దీపా‌వళి బాక్సాఫీస్ రేసులో విన్నర్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు రూ.50 కోట్ల క్లబ్‌లోకి సైతం చేసి, సక్సెస్‌ కు కొలమానంగా నిలిచింది.

"""/" / ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్( 50 Crore Gross Collections Of Rs ) సాధించినట్లుగా మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో సెకండ్ వీక్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం థర్డ్ వీక్‌కి చేరుకుని, థర్డ్ వీక్‌లో విజయవంతంగా ప్రదర్శింపబడుతుండటం విశేషం.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ లో కూడా ‘క’( Ka ) సినిమాకు ఇప్పటికీ మంచి వసూళ్లు వస్తున్నాయని మేకర్స్ చెబుతున్నారు.

"""/" / సినిమా బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆదరిస్తారని చెప్పేందుకు కిరణ్ అబ్బవరం క ది బెస్ట్ ఎగ్జాంపుల్‌ అనేగా బాక్సాఫీస్ వద్ద టాక్‌ని రాబట్టుకుంటోంది.

కాగా కిరణ్ అబ్బవరం డిఫరెంట్ పాత్రలో నటించిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.

శ్రీమతి చింతా వరలక్ష్మి( Mrs.Chinta Varalakshmi ) సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

దర్శక ద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాతో తమ ప్రతిభ నిరూపించుకున్నారు.