రహస్య మెడలో మూడుముళ్లు వేసిన కిరణ్ అబ్బవరం.. ఈ జోడీ సంతోషంగా ఉండాలంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా ఊహించని స్థాయిలో క్రేజ్ కలిగి ఉన్న హీరోలలో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.

ప్రస్తుతం "క"( Ka Movie ) అనే క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న కిరణ్ అబ్బవరం ఈ సినిమాతో భారీ సక్సెస్ ను అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.

రాజావారు రాణివారు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం కెరీర్ మొదలైంది.తొలి సినిమాతోనే కిరణ్ అబ్బవరం విమర్శకుల ప్రశంసలు పొందారు.

ఈ సినిమాలో రహస్య( Rahasya ) హీరోయిన్ గా నటించగా ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి.

అయితే ఆ సినిమా సమయంలో స్నేహితులుగా మారిన కిరణ్ రహస్య తర్వాత రోజుల్లో ప్రేమికులై ఈరోజు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.

ఈ జోడీ కలకాలం సంతోషంగా, అన్యోన్యంగా ఉండాలని రాబోయే రోజుల్లో కిరణ్ అబ్బవరంకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

"""/" / కూర్గ్ లోని ప్రైవేట్ రిసార్ట్ లో కిరణ్ అబ్బవరం రహస్య వివాహం( Kiran Abbavaram Rahasya Wedding ) గ్రాండ్ గా జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కిరణ్ రహస్య ఒకరి కోసమే మరొకరు పుట్టారంటూ కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.కిరణ్, రహస్య సినిమాల్లోకి రాకముందు షార్ట్ ఫిల్మ్స్ లో నటించడంతో పాటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేశారని తెలుస్తోంది.

"""/" / కిరణ్ అబ్బవరం రహస్య కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

కిరణ్ అబ్బవరంకు సోషల్ మీడియా వేదికగా ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.

కిరణ్ అబ్బవరం పారితోషికం పరిమితంగానే ఉందని సమాచారం అందుతుండటం గమనార్హం.కిరణ్ అబ్బవరం సినిమాలలో ఒక సినిమా హిట్ గా నిలిస్తే రెండు సినిమాలు ఫ్లాప్ గా నిలుస్తున్నాయి.

కిరణ్ అబ్బవరం ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024