Kiran Abbavaram Rahasya Gorak : ఘనంగా కిరణ్ అబ్బవరం రహస్య నిశ్చితార్థం… ఫోటోలు వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ హీరోలందరూ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
ఇప్పటికే ఎంతోమంది పెళ్లిళ్లు చేసుకోగా తాజాగా మరొక యంగ్ హీరో పెళ్లికి సిద్ధమయ్యారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) తాజాగా హీరోయిన్ రహస్య గోరక్( Rahasya Gorak ) తో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు.
కిరణ్ అబ్బవరం మొదటిసారి రాజావారు రాణి గారు( Rajavaru Ranigaru ) సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలో హీరోయిన్గా రహస్య నటించారు.
"""/" /
ఇలా ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడినటువంటి వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచారు.
ఇలా ఐదు సంవత్సరాలకు పైగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లికి సిద్ధమయ్యారు .
ఈ క్రమంలోనే బుధవారం కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థపు( Engagement ) వేడుకలను జరుపుకున్నారు.
ప్రస్తుతం ఈ నిశ్చితార్థపు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. """/" /
ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తరచు వార్తలు వస్తున్న ఎప్పుడూ కూడా ఈ వార్తలపై స్పందించిన దాఖలాలు కూడా లేవు ఇక ఇటీవల కిరణ్ అబ్బవరం నూతన గృహప్రవేశ కార్యక్రమాల సమయంలో కూడా రహస్య పాల్గొని సందడి చేశారు.
అప్పుడు కూడా వీరి డేటింగ్ రూమర్స్ వైరల్ అయ్యాయి.ఎట్టకేలకు వీరి గురించి వచ్చిన రూమర్స్ నిజమయ్యి నిజజీవితంలో కూడా ఒకటి కాబోతున్నారు.
ఇలా బుధవారం నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఈ జంట ఆగస్టులో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది.
ఇకపోతే కిరణ్ అబ్బవరం ఇటీవల కాలంలో నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి.
ప్రస్తుతం ఈయన పలు సినిమాలకు కమిట్ అయ్యారు.ఈ సినిమాలో షూటింగ్స్ అన్ని పూర్తి చేసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
పుష్ప ది రూల్ కలెక్షన్ల లెక్కలివే.. 8 రోజుల్లో ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయా?