క సినిమా హిట్ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న కిరణ్…నిజంగా గ్రేట్ అంటూ?
TeluguStop.com
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోగా కొనసాగుతున్న నటుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పెళ్లి తర్వాత మొదటి హిట్ సొంతం చేసుకున్నారు.
తాజాగా ఈయన క (Ka Movie)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తన సినిమాల పట్ల సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై కిరణ్ అబ్బవరం ఎంతో ఎమోషనల్ అయ్యారు.
తాజాగా ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
"""/" /
ఈ సినిమాకు మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో కిరణ్ అబ్బవరం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
చాలా రోజుల తర్వాత నేను మొదటిసారి ప్రశాంతంగా నిద్ర పోయానని తెలిపారు.ఇక ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
అయితే చాలా విభిన్నంగా చిత్ర బృందం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరిపారు. """/" /
తాజాగా హీరో కిరణ్ అబ్బవరం దేన్ వార్ ఫౌండేషన్ లోని అంధులతో కలిసి తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.
వారితో కాసేపు ముచ్చటించి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు కిరణ్ అబ్బవరం సింప్లిసిటీ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఈయన ఇటీవల నటి రహస్య(Rahasya)ను వివాహం చేసుకున్న సంగతి తెలిసినదే.ఇలా పెళ్లి తర్వాత ఈయన నటించిన సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.