ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని.. కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్ వైరల్!
TeluguStop.com
కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) హీరోగా నటించిన తాజా చిత్రం క.
( Ka Movie ) తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ ని అందుకుంది.
ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.కాగా ఈ సినిమా సక్సెస్ అయిన సందర్బంగా తాజాగా ఒక ఎమోషనల్ పోస్ట్( Emotional Post ) చేశారు మూవీ మేకర్స్.
ఎవరికైనా హిట్ వస్తే హిట్ కొట్టాడు అంటారు కానీ నాకు హిట్ వస్తే హిట్ కొట్టేశాము అంటున్నారు.
క సినిమా సక్సెస్ కంటే మీరు నాపై చూపిస్తున్న ఈ ప్రేమ మరింత సంతోషాన్ని ఇస్తోంది.
"""/" /
ఇంతమంది ప్రేమ పొందిన నేను అదృష్టవంతుడిని.మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కాగా ఇటీవల కాలంలో కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ హిట్ గా నిలుస్తున్నాయి.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. """/" /
అందులో భాగంగానే తాజాగా క సినిమాతో మరో సూపర్ సక్సెస్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చేతిలో మరో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే ఇటీవలే ఆయన మూడుముళ్ల బంధంతో ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే.
తన మొదటి సినిమా హీరోయిన్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయన భార్యతో వచ్చిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.