పవన్ కళ్యాణ్ పై కిరణ్ అబ్బవరం సెన్సేషనల్ కామెంట్స్…వారి సపోర్ట్ ఉన్నట్టేనా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం (kiran Abbavaram) తాజాగా క సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ దీపావళి పండుగ కానుక విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.
దీంతో కిరణ్(Kiran) పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.దానికి తోడు దీపావళి కంటే ముందు చాలా సినిమాలలో నటించినప్పటికీ అవి సరైన సక్సెస్ ను సాధించలేకపోయాయి.
తాజాగా దీపాలు పండుగ సందర్భంగా విడుదలైన సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో కిరణ్ అబ్బవరం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే ఈ సక్సెస్ టైమ్ లో కిరణ్ చేసిన కామెంట్లు ఇప్పుడు ఆయనకు పెద్ద సపోర్టు దొరికేలా చేశాయని అంటున్నారు.
ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తూ.మీరు ఏ హీరో ఫ్యాన్ అని అడగగా.
కిరణ్ ఏ మాత్రం ఆలోచించకుండా తాను పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానిని అని చెప్పేశాడు.
ఇంకేముంది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, పవర్ స్టార్ ఫ్యాన్స్ మొత్తం ఆయనకు పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.
పవన్ వ్యక్తిత్తాన్ని కిరణ్ ఆచిరిస్తున్నాడంటూ ఆయన ఇప్పటి వరకు మాట్లాడుతున్న వాటిని పోస్టులు పెడుతున్నారు.
"""/" /
ఇంకొందరు పవన్ ఫ్యాన్స్ అయితే.పవనిజం అనేది కిరణ్ లో స్పష్టంగా కనిపిస్తోందని ఆయన నిజమైన పవన్ అభిమాని కాబట్టి అతనికి మనం సపోర్టుగా నిలవాలంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
నేను పవన్ కళ్యాణ్ అభిమానిని అనే ఒక్క మాటతో పవర్ స్టార్ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు కిరణ్ అబ్బవరం.
వామ్మో.. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఇన్ని జబ్బులా..?