బేబీ బంప్ తో నటి రహస్య…. భర్తతో కలిసి శివరాత్రి పూజలు… ఫోటోలు వైరల్!

నటుడు కిరణ్ అబ్బవరం ( Kiran Abbavaram ) ఇటీవల క అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నారు.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ హీరోగా కిరణ్ అబ్బవరం మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే ఇటీవల కిరణ్ తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ ( Rahasya Gorak )ను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

"""/" / ఇలా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఇక పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారో త్వరలోనే తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నామని తన భార్య ప్రెగంట్ అనే విషయాన్ని కూడా ఈయన అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా రహస్య బేబీ బంప్ ( Baby Bump )ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శివరాత్రి పండుగను పురస్కరించుకొని వీరిద్దరూ కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న శివరాత్రి ( Shivaratri )వేడుకలలో పాల్గొన్నారు.

"""/" / ఈ క్రమంలోనే రహస్య కిరణ్ అబ్బవరం దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలలో వీరిద్దరూ సంప్రదాయ దుస్తులను ధరించి కనిపించారు.ఇలా రహస్య చీరకట్టులో బేబీ బంప్ తో కనిపించడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు  క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక  కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే త్వరలోనే దిల్ రూబా ( Dil Ruuba )అనే సినిమాతో రాబోతున్నాడు.