Kirak RP: ట్రోల్స్ చేసేవాళ్లపై ఫైర్ అయిన కిర్రాక్ ఆర్పీ.. చేపల పులుసు బాలేదని ప్రచారం చేశారంటూ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ( Kirak RP ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

జబర్దస్త్ లో( Jabardasth ) ఎన్నో స్కిట్ లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.

అంతేకాకుండా జబర్దస్త్ షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు.ఇకపోతే ప్రస్తుతం కామెడీ షోలకు గుడ్ బాయ్ చెప్పేసిన ఆర్పీ బిజినెస్ లో బాగా రానిస్తున్నాడు.

ఈ క్రమంలోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు( Nellore Peddareddy Chepala Pulusu ) పేరుతో హైదరాబాదులో ఒక కర్రీ పాయింట్ ప్రారంభించిన విషయం తెలిసిందే అయితే కిరాక్ ఆర్పీ ఊహించిన దాని కంటే ఎక్కువ స్థాయిలో కస్టమర్స్ వచ్చారు.

"""/" / కర్రీ పాయింట్‌కు పెద్ద సంఖ్యలో జనాలు పోటెత్తారు.దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతుండటంతో తాత్కాలికంగా కొద్దిరోజులు కర్రీపాయింట్‌ను క్లోజ్‌ చేశాడు ఆర్పీ.

డిమాండ్‌కు తగ్గట్టుగా సప్లై ఉండాలన్న ఆలోచనతో నెల్లూరు వెళ్లి అక్కడ చేపల పులుసు పోటీ పెట్టాడు.

ఆర్పీ చేపల పులుసు కు రోజు రోజుకి కస్టమర్ల సంఖ్య పెరిగిపోతుండడంతో బ్రాంచ్లను పెంచుకుంటూ పోతున్నాడు.

ఇప్పటికే అనంతపురం , బెంగుళూర్, విశాఖ పట్టణాల్లొ ఫ్రాంచైజీస్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఆర్పీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది ఆర్పీ చేపల పులుసు బాగోలేదు అంటూ నెగిటివ్గా ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు.

"""/" / అయితే తన చేపల పులుసుపై కొంతమంది కావాలనే కుట్ర చేస్తున్నారు.

నా చేపల పులుసు బాలేదంటూ నెగిటివిటి ప్రచారం చేస్తున్నారు.పెయిడ్ బ్యాచ్ చేసే నెగిటివిటీ వలన నాకేమి నష్టం లేదు.

నా చేపల కూరకి బోలెడంత డిమాండ్ ఉంది.టాలీవుడ్ హీరోలు నా చేపల పులుసు మళ్ళీ మళ్ళీ తీసుకెళుతున్నారు అంటే అది వారికి నచ్చబట్టే కదా, సో వారెంతగా నెగిటివిటీ ప్రచారం చేసినా, ట్రోల్స్ చేసినా నేను క్వాలిటీగా సప్లై చేస్తున్నంతసేపు నాకు భయం లేదు.

నెల్లూరు చేపలతోనే నేను పులుసు పెడుతున్నాను.ఒక్కోసారి అనుకున్నంతగా చేపల పులుసు అందించలేకపోతున్నాను.

కానీ నా వరకు నేను బెస్ట్ చేపల పులుసు అందించడానికి చూస్తాను.ఇప్పుడు నా పెద్దారెడ్డి చేపల పులుసుని కావాలని ఫ్రాంచైజీస్ డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారంటే నాపై ఉన్న నమ్మకమే, నా చేపల పులుసు టేస్ట్ నచ్చబట్టే కదా అంటూ ఆర్పీ ట్రోల్స్ వారికి నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చాడు ఆర్పి.

గుజరాత్‌లో నకిలీ డాలర్ల రాకెట్ గుట్టురట్టు .. నిందితుల్లో ఓ ఆస్ట్రేలియా పౌరుడు