బ్రిటన్‌లో పీజీ .. భారతీయ విద్యార్ధులకు యూకే వర్సిటీ అరుదైన అవకాశం

బ్రిటన్ రాజధాని లండన్‌లోని ప్రఖ్యాత కింగ్స్ కాలేజ్ లండన్.( King's College London ) భారతీయ విద్యార్ధులకు( Indian Students ) అరుదైన అవకాశాన్ని కల్పించింది.

వైస్ ఛాన్సలర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చింది.విస్తృత సామాజిక ప్రభావాన్ని చూపే లక్ష్యంతో పోస్ట్ గ్రాడ్యుయేట్( Post Graduate ) డిగ్రీని అభ్యసించడానికి ఈ అవార్డ్ కింద 10 వేల పౌండ్లు ( భారత కరెన్సీలో రూ.

11,26,000) ఫీజు మినహాయింపు కల్పించనున్నారు.కింగ్స్ కాలేజ్ లండన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శితిజ్ కపూర్( Vice-Chancellor Professor Shitij Kapur ) మాట్లాడుతూ.

భారతీయ విద్యార్ధులకు ఈ అవార్డులు అందడం పట్ల తనకు చాలా ఆనందంగా ఉందన్నారు.

తాను విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించడానికి ఢిల్లీని విడినట్లు శితిజ్ గుర్తుచేసుకున్నారు.

"""/" / 19వ శతాబ్ధంలో భారత స్వాతంత్య్ర సమర యోధురాలు సరోజినీ నాయుడు .

( Freedom Fighter Sarojini Naidu ) కింగ్స్ కాలేజ్‌ పూర్వ విద్యార్ధిని అని ఆయన తెలిపారు.

అలాగే ఈ యూనివర్సిటితో భారతదేశం, భారతీయుల సాంస్కృతిక, చారిత్రాత్మక అనుబంధాన్ని కూడా ఆయన హైలైట్ చేశారు.

యూకేలో సంస్కృతం, బెంగాలీ బోధించిన తొలి యూనివర్సిటీలో ఇది కూడా ఒకటని, మహిళా విద్యార్ధినులను చేర్చుకోవడం ప్రారంభించిన తొలి రోజుల్లో సరోజినీ నాయుడు ఇక్కడ చదువుకున్నారని కపూర్ తెలిపారు.

"""/" / ఇటీవలికాలంలో భారత్ నుంచి దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతుండటం సంతోషంగా ఉందని శితిజ్ చెప్పారు.

అయితే యూకే వర్సిటీలో ఫీజులు వారికి ప్రధాన అడ్డంకిగా ఆయన పేర్కొన్నారు.విద్యార్ధులను ప్రోత్సహించడానికి, తాము వైస్ ఛాన్సెలర్ అవార్డులకు( Vice-Chancellor’s Awards ) శ్రీకారం చుట్టినట్లు శితిజ్ చెప్పారు.

లండన్‌లో ఫుల్ టైం, క్యాంపస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనం ప్రారంభించే 30 మంది భారతీయ విద్యార్ధులకు ఈ అవార్డులు అందుబాటులో ఉన్నాయి.

ఆసక్తిగల వారు ఏప్రిల్ చివరి నాటికి తమ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని కింగ్స్ కాలేజ్ తెలిపింది.

ఆ అవకాశం భారతీయ విద్యార్ధులకు ఆకర్షణీయంగా ఉంటుందని కపూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎయిమ్స్‌లో చదువుకున్న శితిజ్ కపూర్.కింగ్స్ కాలేజ్ వైస్ ఛాన్సలర్ కావడానికి ముందు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలలో చదువుకుని కొన్నాళ్లు బోధనా వృత్తిని చేపట్టారు.