‘కింగ్ ఆఫ్ కోత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. దుల్కర్ కోసం ఎన్టీఆర్?
TeluguStop.com
మలయాళ స్టార్ హీరోల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్( Dulquer Salmaan ) ఒకరు.
ఇతడు ఒకప్పుడు మలయాళ పరిశ్రమకు మాత్రమే పరిమితం కానీ ఇప్పుడు అలా కాదు.
ఇతడు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు.సీతారామం సినిమాలో రామ్ గా వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో సినిమాలంటే అన్ని బాషల ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.
"""/" /
సీతారామం( Sitaramam ) వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.
వరుస సినిమాలు చేస్తూ ఈ యంగ్ హీరో దూసుకు పోతున్నాడు.ఈ యంగ్ హీరో ప్రజెంట్ నటించిన ఒక మూవీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.
''కింగ్ ఆఫ్ కోత''( King Of Kotha ) అనే సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.మరి ఈ నేపథ్యంలో ఈ సినిమా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 13న జరపనున్నారు.
దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్( Young Tiger NTR ) గెస్ట్ గా రాబోతున్నాడు అనే రూమర్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.
మరి ఈ రూమర్స్ పై క్లారిటీ ఇప్పుడు తెలుస్తుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గా తారక్ వస్తాడు అనే రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని టాక్.
దీంతో ఈ వార్తలన్నీ అవాస్తవాలే. """/" /
ఇక సీతారామం వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో సక్సెస్ సాధించిన ఈ యంగ్ హీరో ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
ఈ సినిమాను అభిలాష్ జోషి డైరెక్ట్ చేయగా రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ లుగా నటించారు.
ఇదిలా ఉండగా టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ ఒక సినిమా చేస్తున్నాడు.
లక్కీ భాస్కర్ అనే సినిమాను ప్రకటించి షూట్ కూడా శరవేగంగా చేస్తున్నారు.
నెల రోజుల్లో బాన పొట్టకు బై బై చెప్పాలనుకుంటే ఇలా చేయండి..!