నాగార్జున యాడ్ పై ఫ్యాన్స్ అసంతృప్తి..!
TeluguStop.com
కింగ్ నాగార్జున రీసెంట్ మూవీ ది ఘోస్ట్ ఘోర పరాజమైన విషయం తెలిసిందే.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమైంది.
ఘోస్ట్ ఇచ్చిన షాక్ లో ఉన్న నాగ్ తన నెక్స్ట్ సినిమా ఎనౌన్స్ చేయలేదు.
రైటర్ ప్రసన్నతో సినిమా ఫిక్స్ అని తెలుస్తున్నా ఇంతవరకు అఫీషియల్ గా చెప్పలేదు.
మరోపక్క సినిమాలు పక్కన పెట్టి యాడ్స్ చేస్తున్నాడు నాగార్జున.లేటెస్ట్ గా పూజా హెగ్దేతో కలిసి మాజా యాడ్ లో కనిపించారు కింగ్.
"""/"/
ఈ యాడ్ చూసిన అక్కినేని ఫ్యాన్స్ యాడ్ బాగానే ఉన్నా నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎప్పుడు బాసు అంటున్నారు.
ధమాకాతో హిట్ అందుకున్న ప్రసన్న కుమార్ నాగార్జునతో కూడా ఎంటర్టైనర్ సినిమా చేస్తాడని తెలుస్తుంది.
బంగార్రాజుతో హిట్ అందుకున్న నాగ్ ది ఘోస్ట్ నిరాశపరచింది.అందుకే నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్నారు నాగార్జున.
మిగతా హీరోలంతా సినిమాల విషయంలో స్పీడ్ గా ఉంటే నాగార్జున మాత్రం చాలా లేట్ చేస్తున్నారు.
ఈ విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు.సినిమాల విషయంలో నాగ్ దూకుడు పెంచితే బెటర్ అని ఫ్యాన్స్ కోరుతున్నారు.
మాంసాహారంపై నిమ్మరసం పిండి తీసుకోవచ్చా?