ఆ విషయం చెబితే చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.. కింగ్ నాగార్జున కామెంట్స్ వైరల్!

కింగ్ అక్కినేని నాగార్జున( King Akkineni Nagarjuna ) ఈ ఏడాదికి ఏఎన్నార్ జాతీయ అవార్డ్ ను చిరంజీవికి ఇవ్వనున్నట్టు వెల్లడించారు.

అక్టోబర్ నెల 28వ తేదీన ఈ అవార్డును ప్రధానం చేయనున్నామని ఆయన తెలిపారు.

బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ ( Bollywood Actor Amitabh )ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది.

తన తండ్రి ఏఎన్నార్ శతజయంతిని పురస్కరించుకుని ఆర్కే సినీ ప్లెక్స్ లో వేడుక జరగగా ఆ వేడుకలో నాగ్ మాట్లాడారు.

ఏఎన్నార్ నవ్వుతూ తమకు జీవిత పాఠాలు నేర్పించారని నాగార్జున తెలిపారు.నాన్నగారి పేరు తలచుకుంటే మాకు చిరునవ్వు వస్తుందని నాగ్ పేర్కొన్నారు.

నాన్న నటించిన సినిమాలు మళ్లీ ముందుకొస్తున్నాయని ఆయన తెలిపారు.నవంబర్ లో నిర్వహించనున్న ఇఫి వేడుకలో నాన్న సినీ ప్రయాణం గురించి వీడియో ప్రదర్శించనున్నారని నాగ్ చెప్పుకొచ్చారు.

నాన్నతో పాటు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ( Saheb Phalke Award )గ్రహీతలైన రాజ్ కపూర్ తదితరులపై స్పెషల్ వీడియోలను క్రియేట్ చేస్తానని నాగ్ తెలిపారు.

"""/" / చాలామంది ఫ్యాన్స్ రక్తదానం చేయడం, ఆశ్రమాలలో వృద్ధులకు భోజనం పెట్టడం సంతోషంగా ఉందని నాగార్జున వెల్లడించారు.

అభిమానుల ఆదరణను ఎప్పటికీ మరవలేనని నాగ్ అన్నారు.అవార్డ్ ఇస్తామని చిరంజీవికి చెప్పిన వెంటనే ఆయన ఎమోషనల్ అయ్యారని నాగార్జున వెల్లడించారు.

దీనికంటే పెద్ద అవార్డ్ లేదని నాగార్జున కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / నాగార్జున చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

చిరంజీవికి ఆ అవార్డ్ దక్కడాన్ని నెటిజన్లు ఎంతో మెచ్చుకుంటున్నారు.నాగార్జున కూలీ సినిమాకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుతోందని తెలుస్తోంది.

ఏకంగా నాగ్ 24 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారని సమాచారం అందుతోంది.

స్టార్ హీరో నాగార్జున రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

యూకేలో విషాదం .. రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్ధి దుర్మరణం