తన కెరియర్లో మొదటిసారిగా ఈ అవార్డును సాధించిన కింగ్ కోహ్లి..

టీమిండియా మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ, రన్ మెషిన్ తన పేరు మీద రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్నాడు.

తన క్రికెట్ కెరియర్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను నమోదు చేసిన విరాట్ కోహ్లీ తొలిసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎంపికయ్యాడు.

2021 జనవరిలో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టింది.

విరాట్ కోహ్లీకి అక్టోబర్ నెలలో అద్భుతమైన ప్రదర్శనకు గాను ఈ అవార్డు వచ్చింది.

అక్టోబర్ నెలలో చేసిన ప్రదర్శనకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం టీమిండియా తరఫున కింగ్ కోహ్లీ తోపాటు దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రాజా లను ఐసీసీ నామినేట్ చేసింది ప్రపంచ దేశాల క్రికెట్ అభిమానులు మాత్రం విరాట్ కోహ్లీ నే ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఎన్నుకున్నారు.

అక్టోబర్ నెలలో కోహ్లీ 205 పరుగులు చేశాడు.ఇందులో రెండు హాఫ్ ఇంచరీలు ఉన్నాయి.

అంతకుముందు ఆసియా కప్ 2012లో రెండు సెంచరీలు ఒక సెంచరీ నమోదు చేశాడు.

"""/"/ ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును పాకిస్తాన్ బ్యాటర్ నిడా దార్ కైవసం చేసుకుంది.

మహిళల ఆసియా కప్ 2022లో వీరోచిత ప్రదర్శనకు నిదా ఈ అవార్డును అందుకుంది.

అక్టోబర్ నెలకు ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం భారత మహిళల క్రికెట్ టీం నుంచి జెమీమీ రోడ్రిజ్‌, దీప్తి శర్మ నామినేట్ అయిన వీరిలో మాత్రం ఎవరు కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్గా సెలెక్ట్ కాలేదు.

ఇప్పటివరకు ఈ అవార్డుని ఐదుగురు భారత ఆటగాళ్లు అందుకున్నారు.రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీలు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నారు.

తెలంగాణ రోడ్లపై లంబోర్ఘిని కారు కష్టాలు.. వీడియో వైరల్..