గూడు కట్టుకున్న కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు!
TeluguStop.com
సాధారణంగా పక్షులు గూడు కట్టుకుంటాయి.పాములు చీమలు పెట్టిన పుట్టల్లో, ఇంకా ఎలుకలు తవ్విన కలుగులలో నివసిస్తుంటాయి.
ఇవి సొంతంగా ఎలాంటి గూడు కట్టుకోవు.అయితే ఒక ప్రాంతంలో మాత్రం కింగ్ కోబ్రా తనకోసం సొంతంగా గూడుకట్టుకుంటుంది.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్లో వైరల్ గా మారింది.దాన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
ఈ ఆడ పాము గుడ్లను పెట్టేటప్పుడే గూడుకట్టుకుంటుందట.ఆడ కింగ్ కోబ్రా పక్షుల వలె చెట్లపై కాకుండా కింద రాలిన ఆకులతో గూడు కట్టుకుంటుంది.
కింగ్ కోబ్రా తన గూడు కోసం మొదటగా మంచి ప్లేస్ వెతుక్కుంటుంది.ముఖ్యంగా చెట్ల పక్కన ఉండే ఎత్తయిన ప్రదేశాలను ఎంచుకుంటుంది.
తర్వాత ఆ కోబ్రా చెట్టు ఆకులు, నేల మీదే చక్కటి గూడు నిర్మిస్తుంది.
తన గూడును పూర్తిగా నిర్మించేందుకు ఈ పాముకి 7 నుంచి 14 రోజుల సమయం పడుతుందట.
అయితే ఈ గూడును నిర్మించేటప్పుడు కింగ్ కోబ్రా తన గూడుపై సూర్య రష్మి ఎక్కువగా పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది.
అలానే గూడు లోపలికి ఎలాంటి నీరు ప్రవేశించకుండా దట్టంగా గూడు ఏర్పాటు చేసుకుంటుంది.
"""/"/
ఈ గూడు ఎత్తు ఒక అడుగు, వెడల్పు మూడు అడుగులు ఉంటుంది.
సాధారణంగా కింగ్ కోబ్రా 40 గుడ్ల వరకు పెడుతుందట.వాటికి తగిన ఉష్ణోగ్రత ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ పాము.
అలానే గుడ్లు పెట్టడం నుంచి పొదిగే వరకు కింగ్ కోబ్రా గూడులోనే ఉంటూ తన పిల్లలను కాపాడుకుంటుంది.
ఆహారం, నీరు కోసం అప్పుడప్పుడు బయటికి వెళ్లి మళ్లీ వెంటనే తిరిగి వస్తుంది.
లైంగిక వేధింపుల కేసు .. కెనడాలో భారతీయ విద్యార్ధి అరెస్ట్ , ఒంటరి మహిళలే టార్గెట్