అమెరికాలో భారతీయ విద్యార్ధి దారుణహత్య : న్యాయ పోరాటానికి సాయం చేయండి.. కేంద్రాన్ని కోరిన మృతుడి కుటుంబం

అమెరికాలో డ్రగ్స్ మత్తులో( Drug Addict ) వున్న ఓ నిరాశ్రయుడి చేతిలో భారతీయ విద్యార్ధి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

జార్జియా రాష్ట్రంలోని( Georgia ) ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేస్తున్న వివేక్ సైనీ( Vivek Saini ) అనే భారతీయ విద్యార్ధిని సుత్తితో అత్యంత పాశవికంగా కొట్టి కొట్టి చంపాడు దుర్మార్గుడు.

దాదాపు 50 సార్లకు పైనే వివేక్‌ తలపై దుండగుడు దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

అతని మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.త్వరలోనే మంచి ఉద్యోగంలో చేరి గొప్ప స్థాయికి చేరుకుంటాడనుకున్న కొడుకు .

తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో వారు రోదిస్తున్నారు.సైనీ చివరి చూపు కోసం అతని తల్లిదండ్రులు గుర్జీత్ సింగ్, లలితా సైనీలు ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ ఘటనపై గుర్జీత్ దంపతులు న్యాయ పోరాటం చేయాలని , ఈ విషయంలో తమకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు.

హర్యానాలోని( Haryana ) పంచకుల సమీపంలోని భగవాన్‌పూర్ గ్రామానికి చెందిన వివేక్ సైనీ.

2022లో ఎంబీఏ చేసేందుకు అమెరికాకు( America ) వెళ్లి, కోర్సు పూర్తి చేసిన తర్వాత వర్క్ పర్మిట్‌పై వున్నాడు.

"""/" / జార్జియాలోని ఓ గ్యాస్ స్టేషన్‌లో( Gas Station ) పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే జనవరి 16న సైనీ హత్యకు గురయ్యాడు.వివేక్ బంధువు తరుణ్ .

ది ట్రిబ్యూన్ వార్తాసంస్థతో మాట్లాడుతూ.వివేక్ రెండు రోజులుగా గ్యాస్ స్టేషన్ వద్ద నిరాశ్రయుడైన జూలియన్ ఫాల్క్‌నర్‌కు( Julian Faulkner ) ఆహారం ఇస్తున్నాడని తెలిపాడు.

అయితే వివేక్ వెళ్లిపోమని చెప్పడాన్ని జీర్ణించుకోలేని ఫాల్క్‌నర్ సుత్తితో దాడి చేశాడని తరుణ్ పేర్కొన్నారు.

"""/" / ఫాల్క్‌నర్ గతంలో తన భార్యను, ఒక పోలీసును హత్య చేసిన కేసులో అభియోగాలు మోపబడి.

ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చాడని చెప్పారు.వివేక్ జనవరి 23న భారతదేశానికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోగా.

ఇంతలో ఈ దారుణం జరిగింది.అమెరికా నుంచి అతని భౌతికకాయం స్వగ్రామానికి చేరుకోగా.

జనవరి 25న అంత్యక్రియలు నిర్వహించారు.తమ పెద్ద కొడుకు వివేక్ మరణంతో షాక్‌కు గురైన వీరి కుటుంబం అమెరికాలో న్యాయ పోరాటం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సాయాన్ని అభ్యర్ధించింది.

వాటే ఐడియా గురూ.. కొడుకుకి “వన్ టు సిక్స్”పేరు పెట్టిన తండ్రి.. ఎందుకంటే?