Kimidi Nagarjuna : టీడీపీకి కిమిడి నాగార్జున రాజీనామా..!
TeluguStop.com
విజయనగరం జిల్లాలో( Vizianagaram District ) ప్రతిపక్ష టీడీపీకి షాక్ తగిలింది.పార్టీలో కీలక నేతగా ఉన్న కిమిడి నాగార్జున( Kimidi Nagarjuna ) రాజీనామా చేశారు.
ఈ మేరకు పార్టీతో పాటు పార్టీ పదవులకు కూడా కిమిడి నాగార్జున రాజీనామా చేశారని తెలుస్తోంది.
చీపురుపల్లి నియోజకవర్గ టికెట్ ను పార్టీ అధిష్టానం కళా వెంకటరావుకు( Kala Venkatrao ) ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తనకు టికెట్ రాకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైన కిమిడి నాగార్జున పార్టీని వీడారు.
"""/" /
ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడితే అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
లాబీయింగ్ చేస్తేనే పని జరుగుతుందని తెలుసుకోలేకపోయానన్నారు.ఈ నేపథ్యంలోనే అనుచరులతో చర్చించి, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.