చిచ్చరపిడుగుల క్రియేటివిటీ మాములుగా లేదుగా.. ‘అతడు’ సీన్ వైరల్

సోషల్ మీడియా వచ్చాక నిత్యం ఏదో ఒక వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ ఉంటుంది.

అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది చిన్నారులు చేసే రీక్రియేషన్లు.సినిమాల్లోని ఫేమస్ సీన్స్‌ను పిల్లలు తమదైన శైలిలో పునరావృతం చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

అలాంటి ఒక వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతోంది.2005లో విడుదలైన సూపర్ స్టార్ మహేశ్ బాబు,( Mahesh Babu ) త్రివిక్రమ్( Trivikram ) కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ సినిమా( Athadu Movie ) అప్పట్లో మిక్స్‌డ్ టాక్ పొందినప్పటికీ, సంగీతం విషయంలో మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.

ఇందులో మహేష్ బాబు – త్రిష మధ్య వచ్చే కొన్ని సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా ఒక ఫన్నీ సీన్.త్రిష( Trisha ) బట్టలు మడత పెట్టి వెళ్తుంటే, మహేష్ తన కాళ్లు అడ్డుపెట్టి ఆమెను పడేసే సన్నివేశం ఎంతో నవ్వులు పంచింది.

"""/" / అందులో త్రిష “నువ్వే పడేశావు” అని అంటుండగా, దానికి మహేష్ “నేను ఇక్కడ కూర్చుంటే నా కాళ్లు అక్కడికి ఎలా వస్తాయి?” అని సమాధానం ఇస్తాడు.

దానికి త్రిష “ఇప్పుడు నేను చేసి చూపించనా?” అంటూ ప్రయత్నిస్తుండగానే కుర్చీ నుంచి కింద పడిపోతుంది.

ఈ హాస్య సన్నివేశాన్ని ఇప్పుడు ఇద్దరు చిన్నారులు అదే తీరుగానే యాక్ట్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

"""/" / ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఖుషీ అవుతున్నారు.

"వీళ్లు పిల్లలు కాదు, చిచ్చర పిడుగులు", "సేమ్ టు సేమ్ దించేశారుగా" అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

సరిగ్గా డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్ అన్నీ సరిగ్గా ఉన్నాయంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.

క్రియేటివిటీకి వయస్సుతో సంబంధం లేదనిఈ వీడియో మరోసారి నిరూపించింది.చిన్నారులు కూడా సినిమా, నటనపై ఉన్న ఆసక్తిని ఇలాగే చూపిస్తూ తమ టాలెంట్‌ను ప్రపంచానికి చాటుతున్నారు.

ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మనకో చిన్న నవ్వు వస్తుంది.కానీ, పిల్లల ప్రతిభ మాత్రం మనసుని గెలుచుకుంటుంది.