ఏలూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం..!

ఏలూరు జిల్లాలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది.తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా పదేళ్ల బాలుడిని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.

అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.మూడు లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు సమాచారం.

కిడ్నాప్ కు గురైన బాలుడు తంగెళ్లమూడి లక్ష్మీనగర్ కు చెందిన రాజప్రోలు యశ్వంత్ గా గుర్తించారు.

కిడ్నాపర్ల బెదిరింపుల నేపథ్యంలో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన రూరల్ పోలీసులు కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే చేధించి, బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారని తెలుస్తోంది.

ఓరి దేవుడో.. సైనిక విమానాల్లోనే వలసదారుల దేశ బహిష్కరణ.. ఒక్కో వ్యక్తికి లక్షల్లో ఖర్చు?