హైదరాబాద్ సరూర్ నగర్ లో కిడ్నాప్ కలకలం

హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో కిడ్నాప్ కలకలం చెలరేగింది.తనిఖీలకు వెళ్లిన జీఎస్టీ అధికారులను దుండగులు కిడ్నాప్ చేశారు.

దిల్ సుఖ్ నగర్ లో జీఎస్టీ కట్టకుండా నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న గోదాంను సీజ్ చేసేందుకు అధికారులు మణిశర్మ, ఆనంద్ వెళ్లారు.

ఈ క్రమంలో గోదాం నిర్వాహకుడు మరో ముగ్గురితో కలిసి ఇద్దరు అధికారులను కిడ్నాప్ చేసి వారిప దాడి చేసినట్లు తెలుస్తోంది.

జీఎస్టీ అధికారులను బంధించి కారులో తీసుకుని వెళ్తుండగా దిల్ సుఖ్ నగర్ సమీపంలోని రాజీవ్ చౌక్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు.

అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)