గొర్రె పిల్లను తల్లి వద్దకు చేర్చిన బుడ్డోడు.. నెటిజన్ల ప్రశంసలు

గొర్రె పిల్లను తల్లి వద్దకు చేర్చిన బుడ్డోడు నెటిజన్ల ప్రశంసలు

పిల్లలు దేవుళ్లతో సమానం అనే సామెత ఉంది.వారిలో కల్మషం, కపటత్వం ఉండవు.

గొర్రె పిల్లను తల్లి వద్దకు చేర్చిన బుడ్డోడు నెటిజన్ల ప్రశంసలు

ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం పెరగడం, సోషల్ మీడియా యాప్‌లు విస్తృతంగా ప్రాచుర్యంలోకి రావడంతో పలు వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి.

గొర్రె పిల్లను తల్లి వద్దకు చేర్చిన బుడ్డోడు నెటిజన్ల ప్రశంసలు

ప్రపంచంలో ఏ మూల ఏ ఆసక్తికర సంఘటన జరిగినా అది క్షణాల్లో అందరికీ చేరుతోంది.

తాజాగా ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.బుడిబుడి నడకలు వేసే ఓ బాలుడు చేసిన పని నెటిజన్లను కదిలిస్తోంది.

ఆ చిన్నారిని ప్రశంసిస్తూ కామెంట్లు, లైకులు, షేర్లతో ఆ వీడియో ట్రెండింగ్‌గా మారింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.కొంత మంది చిన్నారులు చేసే పనులు ఎంతో హృద్యంగా ఉంటాయి.

తాజాగా ఓ బాలుడు తప్పిపోయిన గొర్రె పిల్లను దాని తల్లి వద్దకు చేర్చాడు.

చిన్న గొర్రె పిల్లకు సహాయం చేసిన ఆ పసివాడి మనస్తత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో ‘గుడ్‌న్యూస్_మూవ్‌మెంట్’ అనే పేజీ షేర్ చేసింది.''ఆ పిల్లవాడు గొర్రెపిల్లను దాని తల్లికి మళ్లించడంలో ఎంత మధురమైనది.

ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో మేము ఉన్నామని గుర్తుంచుకోండి'' అని క్యాప్షన్ పెట్టారు.

ఈ వీడియోకు 2.7 మిలియన్లకు పైగా వ్యూస్, 1.

91 లక్షల లైక్‌లు వచ్చాయి. """/" / నెటిజన్లు ఈ వీడియోను ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ గొర్రె పిల్ల తన తల్లి కోసం వెదుకుతూ ఉంటుంది.

ఈ బాలుడు దానిని తీసుకుని, దాని తల్లి ఎక్కడుందో వెతుకుతూ వెళ్తాడు.ఓ చోట ఆ గొర్రె పిల్ల తల్లి కనిపిస్తుంది.

దీంతో దానిని తల్లి వద్దకు చేర్చుతాడు.అప్పటికే బాగా ఆకలితో ఉన్న ఆ గొర్రె పిల్ల తన తల్లి వద్దకు వెళ్లి పాలు తాగుతుంది.

తప్పిపోయిన చిన్న గొర్రెతో ఉన్న పొలంలో సూపర్ మారియో లాగా దుస్తులు ధరించిన బాలుడిని రీల్ చూపిస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి28, శుక్రవారం 2025