హీరోయిన్ మీనాతో కిచ్చ సుదీప్ రహస్య వివాహం.. ఇదేం ట్విస్టు
TeluguStop.com
అవును మీరు వింటుంది నిజమే.హీరోయిన్ మీనా తో కిచ్చా సుదీప్ కి రహస్య వివాహం జరిగిందని 2006, 2007 లో కొన్ని పుకార్లు షికార్లు చేశాయి.
ఇక కొన్నేళ్ళకు అంటే 2009లో ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని పెళ్లి చేసుకుని నైనిక అనే ఒక అమ్మాయికి జన్మనిచ్చింది.
ఇదంతా మనకు తెలిసిన విషయమే కానీ కిచ్చా సుదీప్ తో ప్రేమ వ్యవహారం గురించి మాత్రం అప్పట్లో మీడియా బాగానే వాడేసింది.
కానీ నేటి యువతకు ఈ విషయం తెలిసే అవకాశం లేదు.అసలు ఆ ప్రేమ, పెళ్లి విషయానికి సంబందించిన వివరాలు తెలుసుకుందాం.
మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా కన్నడ సినిమా ఇండస్ట్రీలో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మీనా 1990 లో రాజేంద్రప్రసాద్ తో నవయుగం అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.
ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న రజినీకాంత్, కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, మమ్ముకుట్టి వంటి అందరు హీరోలతో జోడి కట్టింది.
మీనా ఇక 2005 వరకు సినిమాలతో బిజీగా ఉన్న ఆ తర్వాత హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో మెల్లిగా కెరియర్ నుంచి విరామం తీసుకుంది.
ఇక ఈ మధ్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లి బిజీ అయ్యింది.
"""/"/
ఇక కిచ్చా సుదీప్ తో మీనా ప్రేమ విషయం సంగతికొస్తే 2003 లో స్వాతి ముత్తు అనే సినిమాలో వీరిద్దరూ కలిసి మొదట నటించారు.
ఆ తర్వాత సరిగ్గా మూడేళ్ళకు 2006లో మై ఆటోగ్రాఫ్ అనే మరొక సినిమాలో కూడా వీరు కలిసి నటించారు.
ఈ రెండవ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరూ క్లోజ్ గా ఉండడాన్ని మీడియా వక్రీకరించింది.
ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ఎక్కువగా రూమర్స్ క్రియేట్ చేసింది. """/"/
దాంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు అనే గాసిప్స్ కూడా ఎక్కువ అయ్యాయి.
కానీ ఈ వార్తలకు జోరు పెరుగుతున్న క్రమంలో సుదీప్ మరియు మీనా ఇద్దరు కూడా మీడియా ముందు తమ స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ రూమర్స్ కి చెక్ పెట్టారు.
మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే.అంతకుమించి ఏమీ లేదు.
కేవలం రెండు సినిమాల్లోనే కలిసి పని చేసాం .నా పెళ్ళికి మీ అందరిని ఖచ్చితంగా పిలుస్తాను అంటూ మీనా స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ వార్తలకు పుల్ స్టాప్ పడింది.
మహాకుంభ్ మోనాలిసా సంచలనం.. 10 రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిన వైరల్ గర్ల్?