కియారా అద్వానీ బ్యాగ్ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..?
TeluguStop.com
అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోను, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోను వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు.
భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా ఎంపికైందని ప్రచారం జరుగుతోంది.
వరుస అవకాశాలతో బిజీగా ఉన్న కియారా వేసుకున్న బ్యాగ్ ద్వారా వార్తల్లో నిలిచింది.
సాధారణంగా ఛానెల్ బెల్ట్ బ్యాగ్ ఖరీదు బ్రాండెడ్ అయితే 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు ఉంటుంది.
సెలబ్రిటీలు ఉపయోగించే బ్యాగ్ లు అయితే 20,000 కు అటూఇటుగా ఉంటుంది.అయితే కియారా వేసుకున్న ఛానల్ బెల్ట్ బ్యాగ్ ఖరీదు మాత్రం ఏకంగా 3,70,000 రూపాయలు.
కియారా తన పుట్టినరోజు సందర్భంగా కొనుగోలు చేసిన ఈ బ్యాగ్ రేటు నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది.
బ్యాగ్ కోసం సెలబ్రిటీలు ఇంత ఖర్చు చేస్తారా అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. """/"/
5000 యూఎస్ డాలర్లు ఖర్చు చేసి కియారా కొనుగోలు చేసిన ఈ బ్యాగ్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.
ఈ బ్యాగ్ ఖరీదు తెలిసి కొందరు నెటిజన్లు తమ సంవత్సరం సంపాదన కంటే కియారా బ్యాగ్ రేటు ఎక్కువగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
పుట్టినరోజు వేడుకల్లో బ్యాగ్ తో ఫోజులిచ్చిన కియారా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలనే కియారా ఎక్కువగా ఎంచుకుంటున్నారు.సినిమాల్లో ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లో కనిపించే కియారా రియల్ లైఫ్ లో మాత్రం ట్రెడిషనల్ గా ఉంటానని చెబుతున్నారు.
తన ఫ్రెండ్స్ అంతా డేటింగ్ యాప్స్ వాడతారని తాను మాత్రం డేటింగ్ యాప్ వాడేంత అప్ డేట్ కాలేదని చెప్పారు.
బోల్డ్ పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్న కియారా తాను ట్రెడిషనల్ గర్ల్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నా నెటిజన్లు మాత్రం కియారా అప్పియరెన్స్ ఆ విధంగా ఉందని చెబుతున్నారు.
సాయి పల్లవితో నటించడం పెద్ద సవాల్… నటుడు నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!