లైఫ్ ఇచ్చిన నిర్మాతగా హ్యాండ్ ఇచ్చిన రామ్ చరణ్ హీరోయిన్

టాలీవుడ్ లో భరత్ అనే నేను సినిమాతో తెరంగేట్రం చేసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియరా అద్వానీ.

ఈ సినిమా తర్వాత తెలుగులో రామ్ చరణ్ కి జోడీగా కూడా ఈ భామ ఆదిపాడింది.

ఇక ధోని సినిమాతో బాలీవుడ్ లోకి తెరంగేట్రం ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి కరణ్ జోహార్ నిర్మించిన లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ మంచి విజయం అందించింది.

ఇక ఆ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలు అందుకుంటుంది.

ఆమె చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలకి పైగానే ఉన్నాయి.అయితే ఇలాంటి సమయంలో ఊహించని విధంగా కరణ్ జోనర్ ఒక సినిమా కోసం కియరా డేట్స్ కావాలని అడగడంతో ఆమె కుదరదని చెప్పినట్లు బీటౌన్ లో వినిపిస్తుంది.

కరణ్ జోనర్ తన సొంత బ్యానర్ లో తన దర్శకత్వంలో తెరకెక్కించే మిస్టర్ లేలె సినిమా కోసం కియరాని హీరోయిన్ గా తీసుకోవాలని సంప్రదించడం జరిగింది.

అయితే ప్రస్తుతం ఉన్న షెడ్యూల్స్ లో ఈ సినిమాకి తాను డేట్స్ కేటాయించలేనని సున్నితంగా తిరస్కరించినట్లు టాక్ వినిపిస్తుంది.

దీంతో కరణ్ ఆమె మీద కాస్తా గుర్రుగా ఉన్నాడని బీటౌన్ లో చెప్పుకుంటున్నారు.

తాను అవకాశం ఇస్తే ఈ రోజు ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు తనకి డేట్స్ ఇవ్వకపోవడంపై కోపంతో ఉన్నాడని మాట్లాడుకుంటున్నారు.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే వారిలో ఎవరో ఒకరు స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

ఆ డైరెక్టర్ కాళ్లు పట్టుకుని డబ్బు తీసుకున్నా.. వైరల్ అవుతున్న సూర్య సంచలన వ్యాఖ్యలు!