ఖుషి సినిమా సఖి సినిమాకు రీమేకా.. ఆ ఒక్కటి తప్ప అంత అదే కథ?

ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలు అన్ని ఆల్రెడీ వచ్చిన కథ లాగానే అనిపిస్తున్నాయి.

చాలామంది దర్శకులు కొత్త కథలు తీసుకోవాలన్న కూడా ఇంతకుముందు వచ్చిన సినిమాలతో మ్యాచ్ అవుతున్నాయని తప్పక రీమేక్ సినిమాలకు అలవాటు పడుతున్నారు.

దీంతో ప్రేక్షకులు సినిమాలపై ఆసక్తి చూపించడం తగ్గిస్తున్నారు.ఇదివరకే వచ్చిన కథ లాగా ఉండటంతో నేరుగా రొటీన్ కథ అని రివ్యూ లో ఇచ్చేస్తున్నారు.

చాలా వరకు లవ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు అన్ని ఇదివరకు వచ్చిన సినిమా సీన్స్ లాగానే అనిపించాయి.

కథ మాత్రం అదేవిధంగా ఉన్నప్పటికీ కూడా కాస్త అక్కడక్కడ చేంజెస్ మాత్రమే చేస్తున్నారు డైరెక్టర్లు.

అయితే తాజాగా విడుదలైన ఖుషి ట్రైలర్ చూసి కూడా ప్రేక్షకులు ఈ సినిమా కూడా ఆల్రెడీ వచ్చిన కథ లాగా ఉందని అంటున్నారు.

విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) సమంత ( Samantha )కలిసి నటించిన సినిమా ఖుషి.

"""/" / ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు కొంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అయితే ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పేరు పవన్ కళ్యాణ్ సినిమా పేరు పెట్టారని గతంలో పవన్ అభిమానులు ఫైర్ అయిన సంగతి తెలిసిందే.

కానీ దర్శకుడు ఈ విషయంను లైట్ తీసుకొని సినిమాకు ఖుషి అని పేరు పెట్టేసాడు.

అయితే నిన్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ పలు భాషలలో విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక ట్రైలర్ చూస్తే చాలు సినిమా స్టోరీ పూర్తిగా అర్థం అయినట్లుగా ఉంది.

విజయ్ దేవరకొండ సమంతను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.ఆ తర్వాత సమంత కూడా విజయ్ దేవరకొండ ని ఇష్టపడుతుంది.

ఇక ఇద్దరు తమ ప్రేమ గురించి తమ పేరెంట్స్ దగ్గర చెప్పగా సమంత తండ్రి ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోడు.

సమంత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో తన తండ్రి జ్యోతిష్యాలు చూస్తాడు కాబట్టి వారిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు వస్తాయని చెబుతాడు.

"""/" / దీంతో వారిద్దరూ పెళ్లి చేసుకొని తమ మధ్య బంధం ఎటువంటిదో వీళ్లకు చూపించాలి అని రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటారు.

కానీ పెళ్లి చేసుకున్న కొన్ని రోజుల నుండి వీరిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్దాల వల్ల గొడవలు జరుగుతాయి.

అయితే ఇదే కథ గతంలో అనగా 2000 సంవత్సరంలో సఖి సినిమా( Sakhi's Movie )లో ఉంది.

డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో మాధవన్, శాలిని జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో మంచి సక్సెస్ అందుకుంది.

"""/" / ఇక ఈ సినిమాలో కూడా వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకోగా తమ పెళ్ళికి తమ పెద్దలు అంగీకరించరు.

దీంతో వారిద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకోగా ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడంతో వారిని బయటికి వెళ్లగొడతారు.

దీంతో ఇద్దరు సపరేట్ గా కాపురం పెట్టగా వీరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో అవి గొడవలకు దారితీస్తాయి.

చాలావరకు సఖి సినిమా కథ మొత్తం ఖుషి( Khushi Movie ) లో ఉన్నట్లు కనిపించింది.

దీంతో ఈ ట్రైలర్ చూసిన జనాలంతా ఖుషి సినిమా కథ అచ్చం సఖి కథలాగా ఉంది అని కేవలం సినిమా పేరు ఒక్కటే వేరు కానీ.

మొత్తం డైరెక్టర్ ఆ సినిమానే దింపేశాడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.మరి సినిమా విడుదలైన తర్వాత ఇంకెన్ని ట్రోల్స్ వస్తాయో చూడాలి.

అమెరికాలో అక్రమ నివాసం .. 18000 వేల మంది భారతీయుల బహిష్కరణకు ఏర్పాట్లు