బెంగళూరుకు చేరిన ‘ఖమ్మం’ పాలిటిక్స్..!!
TeluguStop.com
త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో ‘ఖమ్మం’ ఎంపీ అభ్యర్థి వ్యవహారంపై కాంగ్రెస్ లో సస్పెన్స్ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే ఖమ్మం రాజకీయాలు బెంగళూరుకు చేరుకున్నాయి.ఖమ్మం పార్లమెంట్( Khammam ) నియోజకవర్గ అభ్యర్థిగా అవకాశం తమ వారికే ఇవ్వాలని జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పట్టుబడుతున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
తన సతీమణి నందినికి లేదా రాయల నాగేశ్వర రావుకు టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరుతున్నారు.
తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని మంత్రి పొంగులేటి అధిష్టానాన్ని కోరుతున్నారు.
ఈ క్రమంలో భట్టి, పొంగులేటిని కర్ణాటక డిప్యూటీ సీఎం బెంగళూరుకు పిలిపించారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ( DK Shivakumar )ఆధ్వర్యంలో ఖమ్మం సీటుపై మంతనాలు జరుగుతున్నాయని సమాచారం.
కాగా ఇవాళ సాయంత్రం లోగా ఖమ్మం పార్లమెంట్ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.