ఖమ్మం జిల్లాలో మరోసారి మావోయిస్టుల లేఖ కలకలం..!!

ఖమ్మం జిల్లాలో మావోయిస్ట్ పేరిట విడుదలైన ఓ లేఖ తీవ్ర కలకలం సృష్టించింది.

మావోయిస్ట్ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల అయిందని తెలుస్తోంది.

హిందుత్వ పాసిస్ట్ ఆర్ఎస్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచార ఆందోళనతో పాటు ప్రతి ఘటన క్యాంపెయిన్ నడపాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారని తెలుస్తోంది.

ఈడీ, ఎన్ఐఏ, సీబీఐ వంటి సంస్థలను దుర్వినియోగ పరుస్తున్నారని మండిపడ్డారు.ప్రజా వ్యతిరేక విధానాలపై మాట్లాడే గొంతుకలను నొక్కేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

అంతేకాకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాన్ని పెంపొందిస్తుందని లేఖలో వెల్లడించారని సమాచారం.

సందీప్ రెడ్డి వంగ సినిమాలో బోల్డ్ సీన్స్ ఎందుకు ఉంటాయో తెలుసా..?