ఈ అమ్మ ప్రేమకు సలాం అనాల్సిందే.. 82 సంవత్సరాల వయస్సులో కదల్లేని ఇద్దరు కొడుకులకు సపర్యలు చేస్తూ?

కొడుకును తల్లి ప్రేమించిన విధంగా మరెవరూ ప్రేమించరనే సంగతి తెలిసిందే.కొడుకుకు ఎలాంటి కష్టం వచ్చినా తల్లి అస్సలు తట్టుకోలేదు.

82 సంవత్సరాల వయస్సులో ఒక తల్లి పిల్లల కోసం పడుతున్న కష్టం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఖమ్మం జిల్లా( Khammam District ) ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన చాపలమడుగు దానమ్మ( Chapalamadugu Danamma ) కదలలేని స్థితిలో ఉన్న ఇద్దరు కొడుకులు భూషి, దశరథలకు ఏకైక దిక్కుగా మారారు.

పెద్ద కొడుకు పుట్టినప్పటి నుంచి పిల్లలకు సపర్యలు చేస్తూ దానమ్మ తల్లి మనస్సును చాటుకుంటున్నారు.

దానమ్మ ఇద్దరు కొడుకులు పుట్టుకతోనే దివ్యాంగులు( Divyang ) కాగా మూడో, నాలుగో సంతానం ఆడపిల్లలు పుట్టారు.

వాళ్లు ఆరోగ్యంగానే ఉండగా ఐదో సంతానంలో పుట్టిన కొడుకు కూడా దివ్యాంగుడు కావడం గమనార్హం.

దానమ్మ, భర్త వెంకయ్య( Venkayya ) కూలి పనులకు వెళ్తూ పిల్లలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నారు.

"""/" / భర్త వెంకయ్య మరణంతో దానమ్మ కష్టాలు మరింత పెరిగాయి.పదేళ్ల క్రితం రెండో కొడుకు చనిపోయాడు.

తనకు వస్తున్న పెన్షన్, కొడుకులకు వస్తున్న పెన్షన్ తో దానమ్మ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు.

దళిత బంధు స్కీమ్( Dalit Bandhu Scheme ) కింద ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తమ కొడుకులకు చక్రాల కుర్చీలను( Wheel Chair ) ఇవ్వాలని దానమ్మ కోరుతున్నారు.

"""/" / కొడుకులపై ప్రేమతో 82 సంవత్సరాల వయస్సులో సైతం కష్టపడుతున్న దానమ్మ మంచి మనస్సు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు.

తెలంగాణ సర్కార్ దానమ్మ పరిస్థితిని చూసి సహాయం చేస్తుందేమో చూడాల్సి ఉంది.అమ్మమ్మ పరిస్థితిని చూసిన దానమ్మ రెండో కూతురు కొడుకు క్రాంతి ఆమెతోనే ఉంటూ చిన్నచిన్న పనులకు సంబంధించి సహాయం చేస్తున్నారు.

దానమ్మ మంచి మనస్సు గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

పుష్ప 2 లో రెండు ఐటెం సాంగ్స్ పెట్టడానికి కారణం ఏంటో చెప్పిన సుకుమార్…