ఖమ్మంలో సిపీఎం ఒంటరి పోరాటం.. 30 డివిజన్లలో పోటీకి రెడీ..!

ఈ నెల 30న జరుగనున్న మున్సిపల్ ఎలక్షన్స్ లో ఖమ్మం లో అన్ని పార్టీలు తమ సత్తా చాటాలని చూస్తున్నాయి.

అయితే కమ్యునిస్టు పార్టీలు పొత్తుల ప్రక్రియపై ఓ క్లారిటీ వచ్చేసింది.టీ.

ఆర్.ఎస్ తో సిపీఐ మాత్రమే పొత్తు పెట్టుకోగా సీపీఎం మాత్రం ఒంటరిగానే బరిలో దిగుతున్నట్టు తెలుస్తుంది.

అయితే సీపీఐ 60 డివిజన్లు ఉన్న ఖమ్మంలో 30 డివిజన్ల నుండి పోటీకి సిద్ధమైంది.

నిర్ణయించుకున్న ఆయా డివిజన్లలో పార్టీ అభ్యర్ధులు నామినేషన్లు వేశారు.ముందు 25 డివిజన్లలో మాత్రమే పోటీ చేయాలని అనుకున్న సీపీఐ ఫైనల్ గా 30 డివిజన్లలో నామినేషన్స్  వేసి ప్రచారాన్ని మొదలు పెట్టాయి.

ఖమ్మం అర్బన్ పరిధిలో 1,2, 14, 15, 60 డివిజన్లతో పాటుగా ఖనాపురం హవేలి పరిధిలో 5,6,7,53 డివిజన్లు.

ఖమ్మం వన్ టౌన్ పరిధిలోని 23, 25, 37, 40, 42 టూ టౌన్ లోని 43, 44, 50, 52 తీ టౌన్ లో 17, 27 నుండి 36 వరకు, 48 డివిజన్లలో నామినేషన్లు వేశారు.

వారు పోటీ చేయని మిగతా డివిజన్లలో కాంగ్రెస్, టీడీపీ పోటీచేసే వారికి మద్ధతు ఇవ్వాలని సీపీఎం ఫిక్స్ అయ్యింది.

కాంగ్రెస్ 60, టీడీపీ 16 డివిజన్లలో నామినేషన్లు దాఖలు చేయడంలో ఈ పొత్తులు, డివిజన్ల సర్ధుబాట్లు స్పష్టత రావాల్సి ఉంది.

 అన్ని పార్టీలు ప్రచారాలు మొదలు పెట్టాయి.ఖమ్మం ప్రజల తీర్పుపై అధికార ప్రతిపక్ష పార్టీలు నమ్మకంగా ఉన్నాయి.

పెళ్లి చేసుకోబోతున్న ఒలింపిక్ పతక విజేత